BSNL Freedom Offer : BSNL యూజర్లకు బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 1తో రోజుకు 2GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ..!

BSNL Freedom Offer : ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

BSNL Freedom Offer

BSNL Freedom Offer : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండగే.. ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్ అందిస్తోంది. అత్యంత సరసమైన (BSNL Freedom Offer) ధరకే అద్భుతమైన ఆఫర్‌ అందిస్తోంది.

ఈ ఆఫర్ కింద కేవలం రూ. 1 చెల్లిస్తే చాలు.. 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ ముఖ్యంగా కొత్త బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

BSNL కొత్త ‘ఫ్రీడమ్ ఆఫర్’ :
బీఎస్ఎన్ఎల్ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ‘ట్రూ డిజిటల్ ఫ్రీడమ్’ అనే పేరుతో కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 మధ్య కొత్త BSNL సిమ్ తీసుకుంటే.. కేవలం రూ. 1 రీఛార్జ్‌తో 30 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు.

ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, నేషనల్ రోమింగ్, రోజుకు 2GB డేటా, 100 SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ వరకు అందుబాటులో ఉంటుంది. దేశంలోని అన్ని సర్కిల్‌లలోని యూజర్లకు వర్తిస్తుంది. BSNL అధీకృత స్టోర్ నుంచి కేవలం రూ. 1కి కొత్త సిమ్ కార్డుతో ఈ ప్లాన్‌ను పొందవచ్చు.

Read Also : Post Office Scheme : మీకు ఈ నెల జీతం పడిందా? మీ పిల్లల భవిష్యత్తు కోసం కేవలం రూ. 400 పెట్టుబడితో రూ. 70 లక్షలు సంపాదించుకోవచ్చు..!

ట్రాయ్ లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. గత నెలల్లో BSNL, Vi నెట్‌వర్క్ నుంచి లక్షలాది మంది వినియోగదారులు ఇతర కంపెనీలకు పోర్ట్ అయ్యారు. వినియోగదారుల తగ్గుతున్న సంఖ్య దృష్ట్యా బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటాను మళ్లీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. BSNL సగటు వినియోగదారు ఆదాయం (ARPU) పెంచాల్సి ఉంది. అలాగే టారిఫ్ ధరలను పెంచకూడదని ప్రభుత్వం సూచించింది.

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ :
ఎయిర్‌టెల్ ఇటీవలే రూ.399 కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, ఫ్రీ నేషనల్ రోమింగ్ (జమ్మూ, కాశ్మీర్ మినహా) అందిస్తుంది.

ఆసక్తిగల వినియోగదారులు ప్రతిరోజూ 2.5GB డేటా, 100 SMS బెనిఫిట్స్ ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. OTT కంటెంట్ ప్రియులకు అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు.