Post Office Scheme : మీకు ఈ నెల జీతం పడిందా? మీ పిల్లల భవిష్యత్తు కోసం కేవలం రూ. 400 పెట్టుబడితో రూ. 70 లక్షలు సంపాదించుకోవచ్చు..!
Post Office Scheme : మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయండి. మీ కుమార్తె వివాహం లేదా విద్య కోసం డబ్బులను ఆదా చేయండి.

Post Office Scheme
Post Office Scheme : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే, జీతం పడిన వెంటనే అందులో కొంత మొత్తాన్ని పెట్టుబడి కోసం వినియోగించండి. మీకు పిల్లలు (Post Office Scheme) పుట్టిన వెంటనే వారి పేరుతో డబ్బును ఏదైనా మంచి సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టండి. ఒకవేళ మీరు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే పోస్టాఫీసులో అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.
మీ కూతురి వివాహం కోసం భవిష్యత్తులో భారీ మొత్తంలో డబ్బును సంపాదించాలని అనుకుంటే కేవలం సేవింగ్ చేయడం మాత్రమే సరిపోదు. మీ సేవింగ్ మొత్తాన్ని ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టాలి. ఇంతకీ ఏ పథకంలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందంటే.. ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకమే సుకన్య సమృద్ధి యోజన.
ముఖ్యంగా కుమార్తెల భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. చాలా మంది ఈ పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. మీరు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడంపై 8.2 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఇందులో ప్రయోజనం ఏమిటంటే.. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.
ప్రతి ఏడాది ఎంత డిపాజిట్ చేయాలి? :
మీ కుమార్తె పేరు మీద ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. పిల్లల చదువు నుంచి వారి పెళ్లి వరకు ఖర్చులను భరించవచ్చు. మీరు సుకన్య సమృద్ధి యోజనలో ఏడాదికి రూ. 250 నుంచి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
ఇందులో, ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరుతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ, కవలలు ఉంటే 3 అమ్మాయిల అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి గరిష్టంగా 15 ఏళ్ల వరకు ఖాతాలో డిపాజిట్లు చేయవచ్చు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 ఖాతాలో జమ చేయకపోతే.. అకౌంట్ డిఫాల్ట్ అవుతుంది. ఆ అకౌంట్ 15 ఏళ్లలోపు మాత్రమే మళ్లీ ఓపెన్ చేయొచ్చు.
డబ్బును ఎప్పుడు విత్‌డ్రా చేయాలంటే? :
మీ కుమార్తెకు 18 ఏళ్లు నిండకముందే తల్లిదండ్రులు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పాసైన తర్వాత ఈ అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకేసారి లేదా ఏడాదికి ఒకటి మించకుండా వాయిదాలలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ చెందుతుంది. కానీ, పోస్టాఫీసు డిపాజిట్లు 15 ఏళ్లు మాత్రమే చేయాల్సి ఉంటుంది. మీ కుమార్తెకు 18 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఆమె పెళ్లి సమయంలో మీ పెట్టుబడిపై మెచ్యూరిటీ కూడా పూర్తవుతుంది.
రూ. 400 నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదన :
మీ కుమార్తె పేరు మీద ఈ అకౌంట్ ఓపెన్ చేయండి. మెచ్యూరిటీ తర్వాత రూ. 70 లక్షలు సంపాదించుకోవచ్చు. ముందుగా మీరు ప్రతిరోజూ దాదాపు రూ. 400 డిపాజిట్ చేయాలి. అంటే నెలకు రూ. 12500 డిపాజిట్ చేయాలి.
అదే ఏడాదికి రూ. 1.5 లక్షల జమ అవుతాయి. ఇప్పుడు మీ కుమార్తెకు 5 ఏళ్ల వయస్సు నుంచే ఈ ఖాతాలో ఏటా రూ. 1.5 లక్షల పెట్టుబడి పెడతారు అనమాట. అలా 15ఏళ్ల తర్వాత మీ ఖాతాలో రూ. 70 లక్షల వరకు రాబడి పొందవచ్చు.