Friendship Day 2025 : హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.. రూ. 15వేల ధరలో 5 అద్భుతమైన టెక్ గాడ్జెట్లు.. మీ బెస్ట్ ఫ్రెండ్‌కు గిఫ్ట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి..!
Friendship Day 2025 : ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ కోసం చూస్తున్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం 5 అద్భుతమైన టెక్ గాడ్జెట్‌లు ఉన్నాయి..

Friendship Day 2025
Friendship Day 2025 : హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.. 2025 స్నేహితుల పండగ రోజు సందర్భంగా ప్రతిఒక్కరూ తమ స్నేహితులకు విషెస్ తెలుపుతుంటారు. మరికొంతమంది (Friendship Day 2025) తమ బెస్ట్ ఫ్రెండ్ కోసం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు.
మీరు కూడా ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన టెక్ గాడ్జెట్ గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మీ బెస్ట్ ఫ్రెండ్‌కు టెక్ గాడ్జెట్లపై ఎక్కువగా ఆసక్తి ఉంటే అలాంటివే గిఫ్ట్ ఇవ్వొచ్చు.
వివిధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం భారీ తగ్గింపు ధరలకు 5 గాడ్జెట్లు లభ్యమవుతున్నాయి. ఈ టెక్ గిఫ్ట్స్ జాబితాలో ట్రావెలింగ్, మ్యూజిక్ నుంచి ఫిట్‌నెస్, ఆరోగ్యం వరకు అనేక రకాల గాడ్జెట్లు ఉన్నాయి.
మీ బెస్ట్ ఫ్రెండ్ సర్‌ఫ్రైజ్ చేసేలా వారిని ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన టెక్ గాడ్జెట్లను గిఫ్ట్స్ గా అందించవచ్చు. రూ. 15వేల లోపు ధరలో ఏదైనా టెక్ గాడ్జెట్ నచ్చితే మీకు బెస్ట్ ఫ్రెండ్ కు ఇచ్చి సర్‌ప్రైజ్ చేయొచ్చు. అవేంటో ఓసారి లుక్కేయండి..
1. ఒప్పో ప్యాడ్ SE :
ఫ్రెండ్‌షిప్ డే 2025 సందర్భంగా మీ స్నేహితుల కోసం ఒప్పో ప్యాడ్ SE డివైజ్ భారీ 11-అంగుళాల ఐ-కేర్ LCD డిస్‌ప్లేను అందిస్తుంది. వీడియోలను చూడటం లేదా ప్లేలిస్టులు లేదా టూర్ ప్లానింగ్ వంటి పార్టనర్ ప్రాజెక్టులలో బాగా పనిచేస్తుంది. ఈ ఒప్పో ఫ్యాడ్ హై-రెస్ ఆడియోతో క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంది.
వీడియో కాల్స్ లేదా క్లియర్ సౌండ్ అందిస్తుంది. 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు 9,340mAh బ్యాటరీతో వస్తుంది. సింగిల్ రీఛార్జ్ చేస్తే చాలు.. ఎక్కువసేపు ఛార్జింగ్ వస్తుంది. ఒప్పో టాబ్లెట్‌లో గూగుల్ జెమిని ఏఐ కూడా ఉంది.
ఇన్‌స్టంట్ ట్రాన్సులేషన్, రియల్ టైమ్ సెర్చ్ వంటి స్మార్ట్ టూల్స్ కూడా అందిస్తుంది. స్నేహితులను దూరం నుంచి దగ్గరగా లేదా కలిసి టూర్ ప్లానింగ్ కోసం వినియోగించవచ్చు. ఒప్పో ప్యాడ్ SE ధర రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. స్టార్‌లైట్ సిల్వర్, ట్విలైట్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
2. అంబ్రేన్ ఏరోసిన్క్యూ మాగ్‌సర్జ్ పవర్ బ్యాంక్ :
అంబ్రేన్ ఏరోసిన్క్యూ మాగ్‌సర్జ్ 10,000mAh కెపాసిటీ కాంపాక్ట్ పవర్ బ్యాంక్. మాగ్నెటిక్‌గా డివైజ్ అటాచ్ చేయడం ద్వారా మాగ్నెటిక్‌గా వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 15W వరకు వైర్‌లెస్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 22W టైప్-C పోర్ట్‌తో కూడా అందుబాటులో ఉంది.
తేలికపాటి డిజైన్‌లో ఛార్జింగ్ సమయంలో హ్యాండ్స్-ఫ్రీ కోసం మడతపెట్టే స్టాండ్ ఉంటుంది. సేఫ్టీ ఫీచర్ల కోసం ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. పవర్ బ్యాంక్ స్మార్ట్ LED ఇండికేటర్లు, BIS సర్టిఫికేషన్, 6 నెలల వారంటీతో వస్తుంది. అమెజాన్‌లో ఈ పవర్ బ్యాంకు ధర రూ. 2,299 ఉండగా, గోల్డెన్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
3. హనీవెల్ సుయోనో P400 బ్లూటూత్ స్పీకర్ :
మీ స్నేహితులు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు. ట్రావెలింగ్ సమయంలో చాలామంది మ్యూజిక్ వినేందుకు ఇష్టపడతారు. మీ స్నేహితులు కూడా మ్యూజిక్ లవర్స్ అయితే హనీవెల్ సువోనో P400 బ్లూటూత్ స్పీకర్ అద్భుతమైన గిఫ్ట్ ఆప్షన్. 15W అవుట్‌పుట్, IPX6 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌ను కలిగి ఉంది.
బయటి ప్రదేశాల్లో వినియోగానికి వీలుగా ఉంటుంది. స్పీకర్ బాస్ రేడియేటర్‌ల చుట్టూ RGB లైటింగ్‌ను కలిగి ఉంది. విజువల్ ఎఫెక్ట్‌లతో సౌండ్ మరింత క్వాలిటీగా ఉంటుంది. 10 గంటల వరకు ఆడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. మంచి క్లారిటీతో స్టీరియో సౌండ్ కలిగిన 78mm డ్రైవర్‌ను కలిగి ఉంటుంది. ఈ స్పీకర్ ధర రూ. 1,889 ఉండగా, బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
4. షార్ప్ FP-F40E-T ఎయిర్ ప్యూరిఫైయర్ :
ఈ షార్ప్ FP-F40E-T ఎయిర్ ప్యూరిఫైయర్ పాసివ్ ఫిల్టర్లు (HEPA, యాక్టివేటెడ్ కార్బన్, ప్రీ-ఫిల్టర్), షార్ప్ ప్లాస్మాక్లస్టర్ అయాన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టెక్నాలజీ ఎయిర్ క్లీనింగ్ చేయడంతో పాటు తేమ స్థాయిలను పొడిబారకుండా ఉండేలా నెగటివ్ అయాన్లను రిలీజ్ చేస్తుంది.
ముఖ్యంగా పొడి వాతావరణంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్లు ఎయిర్ డ్రై చేస్తాయి. తద్వారా చర్మంపై ఇరిటేషన్ కలిగిస్తుంది. అదే ఈ షార్ప్ FP-F40E-T ఎయిర్ ప్యూరిఫైయర్ ద్వారా ఎయిర్ క్వాలిటీని పొందవచ్చు. ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర రూ. 9,949 నుంచి లభ్యమవుతుంది.
5. ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ 41 ఇన్‌స్టంట్ కెమెరా :
గుడ్ మెమెరీస్ ఆనందించే స్నేహితులకు ఫుజిఫిల్మ్ (Fujifilm Instax Mini 41) ఇన్‌స్టంట్ కెమెరా అద్భుతమైన గిఫ్ట్. ఈ కెమెరా ఫొటోలను వెంటనే ప్రింట్ చేస్తుంది. క్లోజ్-అప్ మోడ్, ఈజీ సెల్ఫ్-పోర్ట్రెయిట్‌ల కోసం ఇంటర్నల్ సెల్ఫీ మిర్రర్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా ఫిజికల్ మూవెంట్స్ దాచుకునేలా అందమైన జ్ఞాపకాలను అందిస్తుంది. ఇన్‌స్టాక్స్ మినీ 41 కెమెరా అమెజాన్‌లో రూ. 8,999కి కొనుగోలు చేయొచ్చు.