Samsung Galaxy S23 Ultra 5G : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. ఇలా కొన్నారంటే ఈ శాంసంగ్ S23 అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే..
Samsung Galaxy S23 Ultra 5G : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

Samsung Galaxy S23 Ultra 5G
Samsung Galaxy S23 Ultra 5G : పండుగ సీజన్ దాదాపు వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర టెక్ (Samsung Galaxy S23 Ultra 5G) ప్రొడక్టులపై అదిరిపోయే డిస్కౌంట్లను పొందవచ్చు. మీరు రూ. 75వేల లోపు కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తుంటే.. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ కొనేసుకోవచ్చు.
ప్రస్తుతం గెలాక్సీ S23 అల్ట్రా 5G రూ. 35,141 తగ్గింపుతో పొందవచ్చు. పర్ఫార్మెన్స్, కెమెరా, డిస్‌ప్లే, డిజైన్ దాదాపు రూ. 75వేల ధరతో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ధర :
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సమయంలో ఆసక్తిగల కస్టమర్లు గెలాక్సీ S23 అల్ట్రా 12GB + 256GB వేరియంట్ రూ. 78,759కు పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ శాంసంగ్ స్టోర్‌లో దాదాపు రూ. 1,09,999కు లభిస్తుంది. రూ. 31,141 తగ్గింపుతో ఇంకా ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కస్టమర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 4వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
అంతేకాదు.. మీరు నెలకు రూ. 3,857 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే రూ. 66వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. అయితే, పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఎక్స్‌టెండెడ్ వారంటీతో పాటు మొత్తం మొబైల్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,750 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ, 45W బ్యాటరీతో వస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 200MP మెయిన్, 10MP పెరిస్కోప్, 10MP టెలిఫోటో లెన్స్ పొందుతుంది. 12MP అల్ట్రావైడ్ సెన్సార్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా కూడా పొందవచ్చు.