×
Ad

BSNL Recharge Plan : BSNL చీపెస్ట్ ప్లాన్ భయ్యా.. ఈ రీఛార్జ్‌‌తో 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.. మరెన్నో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది. ఒకసారి రీఛార్జ్ చేస్తే ఏడాది మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. పూర్తి ప్లాన్ వివరాలివే..

BSNL Recharge Plan (Image Credit To Original Source)

  • బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఏడాది ప్లాన్ రూ. 2799
  • ఒకసారి రీఛార్జ్ చేస్తే 365 రోజులు ఎంజాయ్
  • అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 3GB డేటా, 100 ఫ్రీ SMS

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బిగ్ న్యూస్.. ప్రభుత్వ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతుంది. ఈ ఏడాదిలో కంపెనీ తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

ఈ ప్లాన్ కింద వినియోగదారులు ఒక ఏడాది వ్యాలిడిటీతో అనేక అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇప్పుడు, బీఎస్ఎన్ఎల్ ప్లాన్ పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బీఎస్ఎన్ఎల్ తమ యూజర్ల కోసం రూ.2799తో ఏడాది ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ యూజర్లకు సరసమైన ధరకు అనేక అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

BSNL Recharge Plan (Image Credit To Original Source)

బీఎస్ఎన్ఎల్ రూ. 2799 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 2799 ప్లాన్ ఒక ఏడాది లేదా 365 రోజుల పూర్తి వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 3GB డేటా, 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది.

Read Also : Amazon Great Republic Day Sale : గెట్ రెడీ.. అమెజాన్ సేల్‌లో ఈ వన్ ప్లస్ 13 ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?

ఏడాది వ్యాలిడిటీతో ఇతర బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు :
మీ బడ్జెట్ తక్కువ అయితే బీఎస్ఎన్ఎల్ రూ. 2399 ప్లాన్‌ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కింద వినియోగదారులు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 ఫ్రీ ఎస్ఎంఎస్ నుంచి బెనిఫిట్ పొందవచ్చు. అంటే ఈ ప్లాన్ కింద యూజర్లు లిమిటెడ్ డేటాను మాత్రమే పొందుతారు.

బీఎస్ఎన్ఎల్ 4G విస్తరణ :
బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక నగరాల్లో 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించింది. వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను యాక్సస్ చేయొచ్చు.
అంతేకాదు.. టెలికం కంపెనీ 5G నెట్‌వర్క్‌పై కూడా పనిచేస్తోంది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు అతి త్వరలోనే 5G నెట్‌వర్క్‌ను కూడా యాక్సస్ చేయొచ్చు.