Amazon Great Republic Day Sale : గెట్ రెడీ.. అమెజాన్ సేల్‌లో ఈ వన్ ప్లస్ 13 ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?

Amazon Great Republic Day Sale : వన్ ప్లస్ 13 ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా ఏకంగా రూ. 12వేలు తగ్గింపు పొందింది.

Amazon Great Republic Day Sale : గెట్ రెడీ.. అమెజాన్ సేల్‌లో ఈ వన్ ప్లస్ 13 ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?

Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)

Updated On : January 12, 2026 / 7:29 PM IST
  • త్వరలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026
  • ఈ సేల్ జనవరి 16, 2026న ప్రారంభం కానుంది
  • వన్‌ప్లస్ 13పై రూ. 12వేలు తగ్గింపు పొందొచ్చు

Amazon Great Republic Day Sale : కొత్త వన్‌ప్లస్ ఫోన్ అతి తక్కువ ధరకే లభించనుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ప్లాట్‌ఫామ్ అనేక ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లను అందించనుంది.

ఆసక్తిగల కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, కెమెరాలు, ఆడియో ప్రొడక్టులు, వేరబుల్ డివైజ్, కిచెన్, ఆటో అప్లియన్సెస్ వంటి మరెన్నో డీల్స్ పొందవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తుంటే.. ఈ సేల్ మీకోసమే.. అమెజాన్ ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్ ఆఫర్లను ప్రకటించింది. అందులో వన్‌ప్లస్ 13 డీల్ ఒకటి. ఈ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Amazon Great Republic Day Sale

Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)

వన్‌ప్లస్ 13 అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 రూ.69,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా ఈ ఫోన్ రూ.57,999 ధరతో లభ్యమవుతోంది. అసలు ధర నుంచి రూ.12వేలు తగ్గింపు పొందవచ్చు.

వన్‌ప్లస్ 13 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13లో 6.82-అంగుళాల QHD+ ఎల్టీపీఓ 3K డిస్‌ప్లే, డైనమిక్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. హుడ్ కింద, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో అడ్రినో 830 జీపీయూతో రన్ అవుతుంది. 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ఈ శాంసంగ్ S25 అల్ట్రా 5G ఫోన్ ఎందులో తక్కువంటే? ఇలా చెక్ చేయండి!

ఇంకా, హ్యాండ్‌సెట్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh అందిస్తుంది. అలాగే, ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 సర్టిఫికేషన్ కూడా ఉంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13లో 50MP సోనీ ఎల్‌వైటీ 808 ప్రైమరీ లెన్స్, 50MP సోనీ ఎల్‌వైటీ 600 టెలిఫోటో కెమెరా సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో పాటు 120x డిజిటల్ జూమ్ ఉన్నాయి. 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ వన్‌ప్లస్ ఫోన్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.