BSNL 5G SIM Delivery : BSNL కొత్త 5G సిమ్ కావాలా? కేవలం 90 నిమిషాల్లోనే హోం డెలివరీ.. ఎలా బుక్ చేయాలంటే?

BSNL 5G SIM Delivery : ఎయిర్‌టెల్‌తో పోటీగా బీఎస్ఎన్ఎల్ కేవలం 90 నిమిషాల్లో 5G, 4G సిమ్ కార్డులను హోమ్ డెలివరీ చేసే కొత్త సర్వీసును ప్రారంభించింది. వినియోగదారులు ఇలా ఈజీగా కొత్త సిమ్ కోసం ఆర్డర్ పెట్టుకోవచ్చు.

BSNL 5G SIM Delivery

BSNL 5G SIM Delivery : బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మీ కొత్త సిమ్ కార్డు కావాలా? కేవలం 90 నిమిషాల్లోనే మీ ఇంటికే బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ డెలివరీ అవుతుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారులకు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు 5G, 4G సిమ్ కార్డుల కోసం హోమ్ డెలివరీ సర్వీసును కూడా ప్రారంభించింది. మీరు కొత్త BSNL సిమ్ కార్డును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి కేవలం 90 నిమిషాల్లో మీ ఇంటి వద్దకే డెలివరీ చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S24 Ultra : అదిరిపోయే డిస్కౌంట్.. ఇలా చేస్తే.. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోన్ రూ.21వేలకే.. డోంట్ మిస్!

ఎయిర్‌టెల్‌తో పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ 5G సిమ్ హోమ్ డెలివరీ :
ఇటీవలే ఎయిర్‌టెల్ వేగవంతమైన సిమ్ డెలివరీల కోసం బ్లింకిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్ బాటలోనే బీఎస్‌ఎన్‌ఎల్ సొంత హోమ్ డెలివరీ సిమ్ బుకింగ్ సర్వీసును ప్రవేశపెట్టింది.

ఎయిర్‌టెల్‌కు పోటీగా చౌకైన ప్లాన్‌లు, సేవలతో పాటు కొత్త వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మీరు బీఎస్ఎన్ఎల్ సరసమైన ప్లాన్‌లు, రాబోయే 5G సర్వీసులను పొందాలంటే.. మీ ఇంటి నుంచే బీఎస్ఎన్ఎల్ 5G సిమ్ కార్డును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

BSNL 5G సిమ్ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేయాలి? :

  • బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను ఆన్‌లైన్‌లో ఈ కింది విధంగా బుక్ చేసుకోవవచ్చు.
  • అధికారిక పార్టనర్ వెబ్‌సైట్‌ (https://prune.co.in/)ను సందర్శించండి.
  • ‘Buy SIM Card’ ఆప్షన్ ఎంచుకోండి. మీ దేశంగా ‘India’ ఎంచుకోండి.
  • మీ టెలికాం ఆపరేటర్‌గా BSNL ఎంచుకోండి.
  • మీ ఫస్ట్ రీఛార్జ్ (FRC) ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ వివరాలను ఎంటర్ చేసి OTP వెరిఫికేషన్ పూర్తి చేయండి.
  • మీ అడ్రస్ వివరాలను నింపి ఫారమ్‌ను సమర్పించండి.
  • బుకింగ్ తర్వాత మీ BSNL సిమ్ 90 నిమిషాల్లో మీ ఇంటికి డెలివరీ అవుతుంది.

BSNL 4G, 5G నెట్‌వర్క్ విస్తరణ :
బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ విస్తరణ దిశగా దూసుకెళ్తోంది. జూన్ 2025 నాటికి లక్ష 4G టవర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 2024 నాటికి, దాదాపు 80వేల టవర్లు ఇప్పటికే ఏర్పాటు అయ్యాయి.

Read Also : ATM Fees Hike : మే 1 నుంచి కొత్త రూల్స్.. ఏటీఎంలో డబ్బులు తీస్తే దబిడి దిబిడే.. లిమిట్ దాటితే ఛార్జీల మోతే..!

ఈ విస్తరణ తర్వాత BSNL భారత్ అంతటా 5G సర్వీసులను ప్రారంభించనుంది. ఆసక్తికరంగా, బీఎస్ఎన్ఎల్ కొత్త 4G టవర్లు 5Gకి సులభంగా అప్‌గ్రేడ్ అయ్యేలా రూపొందించింది. భారతీయ వినియోగదారులకు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లు, రాబోయే 5G సర్వీసులను తక్కువ ధరలో అందించే అవకాశం ఉంది.