Samsung Galaxy S24 Ultra : అదిరిపోయే డిస్కౌంట్.. ఇలా చేస్తే.. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోన్ రూ.21వేలకే.. డోంట్ మిస్!
Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అతి తక్కువ ధరకే వస్తోంది. అమెజాన్‌లో ఈ అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 Ultra
Samsung Galaxy S24 Ultra : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో అతి తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ లభ్యమవుతుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సరసమైన ధరలో అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ అసలు ధర దాదాపు రూ. 1.5 లక్షలు అయినప్పటికీ, ఇప్పుడు రూ. 50వేల లోపు ధరకు కొనుగోలు చేయొచ్చు. అదే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఏకంగా రూ. 21వేల లోపు ధరకే కొనుగోలు చేయొచ్చు.
భారీగా తగ్గిన గెలాక్సీ S24 అల్ట్రా ధర :
ప్రస్తుతం, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 256GB వేరియంట్ అమెజాన్‌లో రూ.1,34,999 ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్ 32 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.92,399కి తగ్గింది. అమెజాన్ రూ.2,771 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మీరు నెలకు రూ.4,160 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
రూ.21వేలకే గెలాక్సీ S24 అల్ట్రా :
అమెజాన్ రూ. 71,300 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉండే స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 21వేల వరకు ధర తగ్గించవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
డిజైన్ క్వాలిటీ : IP68 రేటింగ్, టైటానియం ఫ్రేమ్.
డిస్‌ప్లే : 6.8-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2x స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 14 OS
పర్ఫార్మెన్స్ : ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్
మెమరీ : 12GB ర్యామ్, 1TB స్టోరేజీ ఆప్షన్ల వరకు.
కెమెరా సెటప్ : క్వాడ్ కెమెరా సిస్టమ్ 200MP + 10MP + 50MP + 12MP సెన్సార్లు.
ఫ్రంట్ కెమెరా : 12MP సెల్ఫీ షూటర్, క్రిస్టల్-క్లియర్ వీడియో కాల్స్, సెల్ఫీలగ
బ్యాటరీ : 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ కొనేసుకోవచ్చు.