Bank FD Rates : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.1శాతం వడ్డీ అందించే బ్యాంకులివే.. ఫుల్ డిటెయిల్స్!

Bank FD Rates : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్నారా? బ్యాంక్ FDలో పెట్టుబడి పెట్టండి. ప్రస్తుతం, కొన్ని ఫైనాన్స్ బ్యాంకులు 9.1శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి.

Bank FD Rates : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.1శాతం వడ్డీ అందించే బ్యాంకులివే.. ఫుల్ డిటెయిల్స్!

Bank FD Rates

Updated On : April 27, 2025 / 4:34 PM IST

Bank FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నారా? ఎందులో చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారా? మీరు సీనియర్ సిటిజన్ అయితే మాత్రం మీకోసం అద్భుతమైన FD స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్ల కోసం చూస్తుంటే బ్యాంక్ FD మీకు అద్భుతమైన అవకాశం.

Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే 42 కీలక పదవులు, ఛైర్మన్ నియామకాలు.. త్వరలో అధికారిక ప్రకటన!

ప్రస్తుతం, కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 3 ఏళ్ల వ్యవధితో FDలపై 9.1శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల కన్నా తక్కువ FDలపై మాత్రమే వర్తిస్తాయి. అన్ని బ్యాంకులు FDలపై వడ్డీని తగ్గిస్తున్నప్పటికీ.. ఈ బ్యాంకులు ఇప్పటికీ సీనియర్ సిటిజన్లకు 9 శాతం కన్నా ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. Paisabazar.com ప్రకారం.. 23, ఏప్రిల్ 2025 వరకు వడ్డీ రేట్లుగా గమనించాలి.

అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకులివే :

  • ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : 9.1 శాతం వడ్డీ రేటు
  • నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : 9శాతం వడ్డీ రేటు
  • జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : 8.75 శాతం వడ్డీ రేటు
  • సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : 8.75 శాతం వడ్డీ రేటు
  • యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 8.65 శాతం వడ్డీ రేటు
  • ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 8.25 శాతం వడ్డీ రేటు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో అనేక బ్యాంకులు తమ FD వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ సమయంలో ఫిక్స్‌‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం.

చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లోని రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద ప్రొటెక్షన్ అందించినప్పటికీ, ఈ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు.. మీ డబ్బును తిరిగి ఇచ్చేలా పెట్టుబడి మొత్తాన్ని DICGC కవరేజ్ పరిమితిలో ఉంచండి. సీనియర్ సిటిజన్లు TDS ఆదా చేసేందుకు ఫారం 15H సమర్పించాల్సి ఉంటుంది.

బడ్జెట్ 2025 ప్రకారం.. ఇప్పుడు బ్యాంకులో రూ. 1 లక్ష కన్నా ఎక్కువ FDలపై TDS తగ్గుతుంది. కానీ, మొత్తం పన్ను బాధ్యత సున్నా అయితే.. మీరు ఫారమ్ 15H సమర్పించడం ద్వారా TDS తగ్గింపును నివారించవచ్చు.

Read Also : SIP Formula : ఈ SIP ఫార్ములాతో నెలకు రూ.14వేలు పెట్టుబడి పెట్టండి చాలు.. కేవలం 16ఏళ్లలో రూ. కోటికిపైగా సంపాదించవచ్చు!

మీ మొత్తం ఆదాయం రూ. 3 లక్షల కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ అన్ని తగ్గింపుల తర్వాత (80C, 80D మొదలైనవి) మీ పన్ను బాధ్యత సున్నాగా ఉన్నప్పుడు మాత్రమే ఫారమ్ 15H చెల్లుతుంది. మీరు రాబోయే 3 ఏళ్లకు మంచి రాబడిని పొందాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.