SIP Formula : ఈ SIP ఫార్ములాతో నెలకు రూ.14వేలు పెట్టుబడి పెట్టండి చాలు.. కేవలం 16ఏళ్లలో రూ. కోటికిపైగా సంపాదించవచ్చు!
SIP Formula : SIPలో పెట్టబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ 14+15+16 ఫార్ములా ప్రకారం.. మీరు నెలకు రూ. 14వేలు చొప్పున ఇన్వెస్ట్ చేయడం ద్వారా కేవలం 16ఏళ్లలోనే రూ. కోటికిపైగా డబ్బులను సంపాదించవచ్చు.

SIP Formula
SIP Formula : పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో రాబడి వస్తుందో తెలుసా? ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం భారీ మొత్తంలో సేవింగ్ చేయాలని భావిస్తుంటారు. ప్రతి ఒక్కరికి ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేరు.
రోజువారీ ఖర్చుల దృష్ట్యా వెనకాడుతారు. అలాంటి వారికి, SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా నెలవారీ పెట్టుబడి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న మొత్తాల్లో స్థిరంగా పెట్టుబడి పెట్టొచ్చు. తద్వారా కేవలం 16ఏళ్లలోనే కోటిశ్వరుడు అవ్వొచ్చు.
Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే.. ఈలోగా రైతులు చేయాల్సిన పనులివే.. లేదంటే రూ. 2వేలు పడవు!
వాస్తవానికి, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా మంది గందరగోళానికి గురవుతారు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టుబడి పెట్టే కాలాన్ని ఎంచుకోవాలి. మీరు SIPలో పెట్టుబడి పెట్టే ముందు 14+15+16 SIP ఫార్ములా గురించి తెలుసుకోవాలి. ఈ విధానాన్ని ఉపయోగించి నెలవారీగా రూ. 14వేలు స్థిరమైన పెట్టుబడితో రూ. 1 కోటి కన్నా ఎక్కువ కార్పస్‌ను పొందవచ్చు.
సాధారణంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అని పిలుస్తారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే విధానంగా చెప్పవచ్చు. పెట్టుబడిదారులు నిర్ణీత వ్యవధిలో స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో నెలవారీ, త్రైమాసిక లేదా వార్షికంగా పెట్టుబడి ఉండవచ్చు. ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
SIP బెనిఫిట్స్ ఇవే :
ఒకేసారి కాకుండా నెలవారీ పెట్టుబడి పెట్టాలి. మీ ఆర్థిక సామర్థ్యం ప్రకారం పెట్టుబడి పెట్టవచ్చు. కాంపౌండింగ్ పవర్ కూడా పెరుగుతుంది. SIP 14+15+16 ఫార్ములా ప్రకారం.. పెట్టుబడిదారుడు మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడిని 16 ఏళ్లు కొనసాగిస్తే 1 కోటి రూపాయల కార్పస్‌ను సంపాదించవచ్చు.
14+15+16 ఫార్ములా ఏంటి? :
ఫార్ములాలో 14 నెలవారీ SIP రూ. 14వేలు సూచిస్తుంది. 15 వార్షిక SIP రాబడిని సూచిస్తుంది. SIPలో 16 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. ఈ ఫార్ములా ఉపయోగించి.. మీరు నెలవారీ రూ. 14వేలు SIPని ప్రారంభించి 16 ఏళ్లు కొనసాగిస్తే.. మీ మొత్తం పెట్టుబడి రూ. 26,88,000 అవుతుంది. 16 ఏళ్లలో మీ పెట్టుబడిపై లాభం దాదాపు రూ.74,16,845 పెరుగుతుంది. సగటు రాబడి రేటు 15 శాతంగా పొందవచ్చు.
16 ఏళ్లలో ప్రారంభ పెట్టుబడితో మూలధన లాభం కలిపి మొత్తంగా రూ. 1,01,04,845 సంపాదించవచ్చు. 14+15+16 ఫార్ములా ద్వారా రూ. 1.01 కోట్లు కూడబెట్టుకుని 16 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు. సగటు రాబడి రేటు 12 శాతంగా పరిగణిస్తే.. మీరు ఈ ఫార్ములాను ఉపయోగించి రూ. 76లక్షల కన్నా ఎక్కువ కార్పస్‌ను కూడబెట్టవచ్చు. 16 ఏళ్ల పెట్టుబడితో రూ. 26,88,000 అవుతుంది.
12శాతం వార్షిక రాబడి :
ఈ పెట్టుబడిపై 12 శాతం వార్షిక రాబడి చొప్పున మూలధన లాభం రూ.49,53,335 అవుతుంది. మూలధన లాభం, పెట్టుబడి కలిపితే మొత్తం దాదాపు రూ.76,41,335 అవుతుంది. సగటు రాబడి రేటు 13 శాతంగా లెక్కిస్తే.. ఈ ఫార్ములాను ఉపయోగించి రూ. 83లక్షల కన్నా ఎక్కువ కార్పస్‌ను కూడబెట్టవచ్చు. 16 ఏళ్లకు పెట్టుబడి రూ. 26,88,000 అవుతుంది.
SIP ఫార్ములాతో 13శాతం వార్షిక రాబడి :
ఈ పెట్టుబడిపై 13 శాతం వార్షిక రాబడి చొప్పున మూలధన లాభం రూ.56,94,671 అవుతుంది. మూలధన లాభం, పెట్టుబడిని కలిపితే మొత్తం అమౌంట్ దాదాపు రూ.83,82,671 అవుతుంది. సగటు రాబడి రేటు 14 శాతంగా పరిగణిస్తే.. ఈ ఫార్ములా (14+15+16)తో రూ. 92 లక్షల కన్నా ఎక్కువ కార్పస్‌ను సంపాదించవచ్చు.
అదే 16 ఏళ్లకు పెట్టుబడితో రూ. 26,88,000 అవుతుంది. ఈ పెట్టుబడిపై 14 శాతం వార్షిక రాబడితో మొత్తంగా రూ.65,13,191 అవుతుంది. మూలధన లాభం పెట్టుబడిని కలిపితే మొత్తం డబ్బులు దాదాపు రూ.92,01,191 అవుతుంది.