8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే 42 కీలక పదవులు, ఛైర్మన్ నియామకాలు.. త్వరలో అధికారిక ప్రకటన!

8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుపై చైర్మన్, మరో ఇద్దరు సభ్యులతో సహా అత్యున్నత పదవులను భర్తీకి పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనుంది.

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే 42 కీలక పదవులు, ఛైర్మన్ నియామకాలు.. త్వరలో అధికారిక ప్రకటన!

8th Pay Commission

Updated On : April 27, 2025 / 2:48 PM IST

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్షర్లకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. 42 పోస్టుల నియామకానికి, చైర్మన్ నియామక ప్రక్రియను ప్రారంభించింది. 8వ వేతన సంఘం కోసం 40 మంది అధికారులను నియమించాలని ఆదేశిస్తూ.. ఏప్రిల్ 21న రెండు వేర్వేరు సర్క్యులర్‌లు జారీ అయ్యాయి.

ఈ పోస్టుల్లో ఎక్కువ భాగాన్ని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. దాంతో పాటు, ఛైర్మన్, మరో ఇద్దరు ముఖ్యమైన సభ్యులను విడిగా ఎంపిక చేస్తారు. నియమించే అధికారులలో ఇద్దరు డైరెక్టర్లు/డిప్యూటీ సెక్రటరీలు, ముగ్గురు అండర్ సెక్రటరీలు, 37 మంది ఇతర సిబ్బంది ఉంటారు. నిబంధనలను (ToR) ఖరారు చేసిన తర్వాత అవసరమైన పనులకు వారికి అప్పగిస్తారు.

Read Also : Flipkart Sale Offer : ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ సేల్.. ఆపిల్ ఐఫోన్లు, ఏసీలు, స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

తక్కువ మంది సభ్యులతో 8వ వేతన సంఘం :
8వ వేతన సంఘంలో గతంతో పోలిస్తే.. తక్కువ మంది సభ్యులు ఉంటారు. మునుపటి వేతన సంఘాన్ని పరిశీలిస్తే.. 7వ వేతన సంఘంలో మొత్తం 45 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఛైర్మన్, 18 మంది సెక్రటేరియట్ సిబ్బంది, 16 మంది సలహాదారులు, 7 మంది ఇతర సిబ్బంది ఉన్నారు.

7వ వేతన సంఘానికి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ నేతృత్వం వహించారు. 6వ వేతన సంఘంలో కూడా నలుగురు సభ్యులు ఉన్నారు. కానీ, సచివాలయంలో 17 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 5వ వేతన సంఘంలో 3 సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రారంభ దశలో మొదటి వేతన కమిషన్‌లో 9 మంది సభ్యులు, రెండవ వేతన సంఘంలో ఆరుగురు, మూడు, నాల్గవ వేతన కమిషన్‌లలో ఐదుగురు చొప్పున సభ్యులు ఉన్నారు.

మరోవైపు.. ఉద్యోగుల వైపు నుంచి కూడా సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. జాతీయ మండలి (JCM) సిబ్బంది కూడా 8వ వేతన సంఘానికి సమర్పించాల్సిన మెమోరాండంను సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 22న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల కనీస వేతనం, పే స్కేల్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సులు, పదోన్నతి విధానం, పెన్షన్ ప్రయోజనాలు వంటి అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు.

మే 20 నాటికి తుది మెమోరాండం :
అన్ని ప్రధాన ఉద్యోగి సంస్థల నుంచి సూచనల తర్వాత మెమోరాండంను రెడీ చేసేందుకు ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలు తమ ప్రతినిధుల పేర్లను ఏప్రిల్ 30, 2025 నాటికి పంపుతాయి. అన్ని సంస్థల సూచనల ఆధారంగా మే 20, 2025 నాటికి తుది మెమోరాండం తయారవుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం ఇంకా అధికారికంగా 8వ వేతన సంఘాన్ని ప్రకటించలేదు.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే.. ఈలోగా రైతులు చేయాల్సిన పనులివే.. లేదంటే రూ. 2వేలు పడవు!

ఎలాంటి నిబంధనలను కూడా జారీ చేయలేదు. రాబోయే కొన్ని నెలల్లో కమిషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 8వ వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 57 లక్షల మంది పెన్షనర్ల వేతనాలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి.