BSNL SIM Home Delivery
BSNL SIM Home Delivery : బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నుంచే బీఎస్ఎన్ఎల్ సిమ్ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం హోమ్ డెలివరీ, డోర్ స్టెప్ కేవైసీతో కొత్త సిమ్ పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు తమ సిమ్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే, తమకు నచ్చిన ప్లాన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
ఇందుకోసం మీరు బీఎస్ఎన్ఎల్ స్టోర్ వద్దకు (BSNL SIM Home Delivery) వెళ్లకుండానే సిమ్ యాక్టివేట్ చేయవచ్చు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా తమ కస్టమర్ల కోసం కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం సిమ్ కార్డ్ హోమ్ డెలివరీ సర్వీసును అందిస్తోంది.
ఈ సర్వీసు ద్వారా కస్టమర్లు స్టోర్‌ను విజిట్ చేయకుండానే బీఎస్ఎన్ఎల్ సిమ్ పొందవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. మీ సిమ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడమే.. కొద్దిరోజుల్లోనే మీ ఇంటి వద్దకే సిమ్ డెలివరీ అవుతుంది. అప్పటికప్పుడే సిమ్ కేవైసీ వెరిఫికేషన్ యాక్టివేషన్ కూడా అయిపోతుంది.
బీఎస్ఎన్ఎల్ సిమ్ హోమ్ డెలివరీ బెనిఫిట్స్ ఇవే :
ఈజీ ప్రాసెస్ : మీరు BSNL స్టోర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.
క్విక్ కేవైసీ : మీ ఇంటి వద్దనే డిజిటల్ వెరిఫికేషన్
మరెన్నో ప్లాన్‌లు : ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఆప్షన్ల నుంచి ఎంచుకోండి.
డోర్ స్టెప్ సర్వీసు : కొన్ని రోజుల్లోనే మీ ఇంటికి సిమ్ డెలివరీ అవుతుంది.
మీ BSNL సిమ్ హోమ్ డెలివరీ కోసం ఆర్డర్ చేసేందుకు ఈ కింది ఈజీ ప్రాసెస్ ఓసారి ట్రై చేయండి.
1. బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
బీఎస్ఎన్ఎల్ అధికారిక పోర్టల్ (bsnl.co.in)కి వెళ్లండి లేదా గూగుల్‌లో “BSNL SIM హోమ్ డెలివరీ” కోసం సెర్చ్ చేయండి.
2. మీ వివరాలను రిజిస్టర్ చేయండి :
మీ పేరు, అడ్రస్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. సిమ్ సరైన లొకేషన్‌కు డెలివరీ అయ్యేలా వివరాలను అందించండి.
3. మీకు ఏ ప్లాన్ కావాలో ఎంచుకోండి :
మీ అవసరాన్ని బట్టి ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఎంచుకోండి. బీఎస్ఎన్ఎల్ సరసమైన డేటా, కాలింగ్ ప్యాక్‌లను పొందవచ్చు.
4. సిమ్ బుక్ చేసుకోండి :
మీ రిక్వెస్ట్ సమర్పించి మీ బుకింగ్‌ను కన్ఫార్మ్ చేసుకోండి. మీకు ఆర్డర్ వివరాలతో కన్ఫర్మేషన్ SMS లేదా ఇ-మెయిల్ వస్తుంది.
5. డోర్‌స్టెప్ వద్దనే కేవైసీ వెరిఫికేషన్ :
డెలివరీ ఎగ్జిక్యూటివ్ వచ్చినప్పుడు మీ ఇంటి వద్దనే ఇన్‌స్టంట్ కేవైసీ వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డు లేదా ఏదైనా ఐడీ ప్రూఫ్‌ను రెడీగా ఉంచుకోండి.
6. మీ సిమ్‌ను యాక్టివేట్ చేసుకోండి :
సిమ్ వెరిఫికేషన్ తర్వాత మీ కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కొన్ని గంటల్లోనే యాక్టివేట్ అవుతుంది.
బీఎస్ఎన్ఎల్ సిమ్ లభ్యత, ఆఫర్లు :
బీఎస్ఎన్ఎల్ 4G సిమ్ దేశంలోని చాలా నగరాల్లో అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ సిమ్ ఆఫర్లను కూడా పొందవచ్చు.
ఎంపిక చేసిన ప్రమోషనల్ క్యాంపెయిన్ కింద ఫ్రీ సిమ్ ఆఫర్లు.
రూ. 107 నుంచి ప్రారంభమయ్యే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లు.
అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ బండిల్స్.
BSNL సిమ్ హోమ్ డెలివరీనే ఎందుకు ఎంచుకోవాలి? :
దేశంలో ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఎక్కువగా అందుబాటులో ఉండే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో BSNL ఒకటి. వినియోగదారులు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. సిమ్ కార్డులు నేరుగా మీ ఇంటికే డెలివరీ చేస్తుంది.