BSNL to soon discontinue Rs 775 Fiber broadband plan, check out the details
BSNL Fiber Plans : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో డిసెంబర్ 14, 2022 నుంచి రూ. 775 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను నిలిపివేయనుంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ప్రారంభంలో ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను BSNL ప్రవేశపెట్టింది. సెలబ్రేషన్ ప్లాన్‌లో భాగంగా.. సెంట్రల్-హెడ్ టెలికాం ఆపరేటర్ అదనపు OTT బెనిఫిట్స్ పాటు 2000GB ఇంటర్నెట్‌తో 150 Mbps డేటా స్పీడ్‌ను అందిస్తోంది.
కానీ, ఈ ప్లాన్ వ్యాలిడిటీ లిమిటెడ్ సమయం వరకు మాత్రమే అందిస్తోంది. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కాంబో టారిఫ్‌ల లిస్టు నుంచి తొలగించింది. రూ. 775 ప్లాన్‌తో పాటు, ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద ఏకకాలంలో ప్రారంభించిన మరో రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కూడా BSNL తొలగించనుంది. అందులో రూ. 275, రూ. 775 వంటి ప్లాన్లు ఉన్నాయి. BSNL ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.
BSNL Rs. 775 Fiber broadband plan :
రూ.775 ప్లాన్ కింద.. BSNL 75 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో 150 Mbps ఇంటర్నెట్ స్పీడ్, 2000GB (2TB) ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. 2000GB డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 10 Mbpsకి తగ్గించనుంది. అదనంగా, ఈ ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్, లయన్స్‌గేట్, షెమరూ, హంగామా, సోనీలివ్, ZEE5, Voot, Yupp TV నుంచి అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, OTT ప్లాన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
BSNL to soon discontinue Rs 775 Fiber broadband plan, check out the details
BSNL Rs. 275 Fiber broadband plan :
బీఎస్ఎన్ఎల్ రూ. 275 ప్లాన్ రెండు ఆప్షన్లలో 75 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 3300GB (3.3TB) డేటాను అందిస్తుంది. రూ. 275 రెండు ఆప్షన్‌ల మధ్య తేడా ఏమిటంటే.. BSNL 30 Mbps స్పీడ్ అందిస్తోంది. మరొకదానిలో, ఇది 60 Mbps స్పీడ్ అందిస్తుంది.
ఇంటర్నెట్ లిమిట్ వినియోగం తర్వాత రెండు ఆప్షన్లలో డేటా స్పీడ్ 4 Mbpsకి తగ్గనుంది. విశేషమేమిటంటే.. BSNL అందించే ఇతర ప్లాన్‌లతో పోల్చితే.. రూ.775, రూ.275 ప్లాన్‌లు రెండూ సరసమైనవే. అన్ని ఇతర BSNL ఫైబర్ ప్లాన్‌లు 1-నెల వ్యాలిడిటీతో హై స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తాయి.
మీ BSNL ప్లాన్‌ని రీఛార్జ్ చేయాలనుకుంటే.. రూ. 775 లేదా రూ. 275తో రీఛార్జ్ చేసుకోండి. ఒకవేళ మీరు BSNL ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే. మీరు సమీపంలోని BSNL ఆఫీసును సంప్రదించి, కొత్త ఫైబర్ కనెక్షన్ కోసం రిక్వెస్ట్ పెట్టవచ్చు. సర్వీస్ ప్రొవైడర్ మీ కొత్త కనెక్షన్‌ని 2-4 రోజుల్లో ప్రారంభిస్తారు. మీరు కొత్త కనెక్షన్ కోసం రిక్వెస్ట్ పెట్టడానికి BSNL అధికారిక సైట్‌కు కూడా విజిట్ చేయవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..