BSNL Broadband Plans : 40mbps స్పీడ్‌తో BSNL నుంచి కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే.. ధర ఎంతంటే?

BSNL New Broadband Plans : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 40 mbps స్పీడ్‌తో రూ. 499తో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఫైబర్ బేసిక్ ప్లాన్‌గా పేరొందిన ఈ ప్లాన్ 3300 GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తోంది.

BSNL Broadband Plans : 40mbps స్పీడ్‌తో BSNL నుంచి కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే.. ధర ఎంతంటే?

BSNL Launches New Broadband Plan with 40mbps speed Price and other benefits

BSNL New Broadband Plans : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 40 mbps స్పీడ్‌తో రూ. 499తో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఫైబర్ బేసిక్ ప్లాన్‌గా పేరొందిన ఈ ప్లాన్ 3300 GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తోంది. కానీ, BSNL ఇప్పటికే ఫైబర్ బేసిక్‌గా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ అందిస్తోంది. టెలికాం ఫైబర్ బేసిక్ ప్లాన్ ధరను రూ.449 నుంచి 499కి పెంచేసింది. BSNL కొత్త రూ. 499 ప్లాన్‌ను పాత పేరు ఫైబర్ బేసిక్‌గా తీసుకొచ్చింది. రూ. 449 ప్లాన్ పేరును ఫైబర్ బేసిక్ నియోగా మార్చింది. ఈ రెండు ప్లాన్‌లతో ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తాయో వివరంగా పరిశీలిద్దాం.

BSNL రూ. 499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 499 బ్రాడ్ ప్లాన్‌ను ఫైబర్ బేసిక్‌గా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ నెలకు 3300GB వరకు హై-స్పీడ్ డేటాతో 40 mbps స్పీడ్ అందిస్తుంది. ఆ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 4mbpsకి తగ్గిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా డౌన్‌లోడ్, లోకల్, STD నెట్‌వర్క్‌ల ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉన్నాయి. BSNL మొదటి నెల అద్దెపై రూ. 500 వరకు 90 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

BSNL Launches New Broadband Plan with 40mbps speed Price and other benefits

BSNL Launches New Broadband Plan with 40mbps speed Price and other benefits

BSNL రూ. 449 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌ను గతంలో ఫైబర్ బేసిక్ ప్లాన్ అనేవారు. ఇప్పుడు BSNL ఈ ప్లాన్‌ని కొత్త పేరుతో అందిస్తోంది. ఫైబర్ బేసిక్ నియో నెలవారీ బిల్లింగ్ సైకిల్‌తో గరిష్టంగా 3300GB డేటా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 30 mbps ఇంటర్నెట్ స్పీడ్ ప్లాన్ అందిస్తుంది. ఈ ప్లాన్ మొదటి నెల బిల్లుపై రూ.500 వరకు 90శాతం డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అదే సమయంలో, BSNL నవంబర్ 15, 2022 నుంచి రూ. 775, రూ. 275 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను నిలిపివేస్తోంది. ఈ ప్లాన్‌లను 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రమోషనల్ ఆఫర్ కింద ఈ ఏడాదిలో ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 75 రోజుల పాటు 2000 GB డేటాతో 150mbps స్పీడ్ అందించింది.

వినియోగదారులు 499 లేదా 449 ప్లాన్‌లకు మారవచ్చు. రూ. 749 లేదా రూ. 799 కూడా ఇలాంటి బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. BSNL రూ.749 ప్లాన్ నెలకు 1000GB డేటాతో గరిష్టంగా 100 mbps స్పీడ్ అందిస్తుంది. ఈ ప్లాన్ SonyLIV ప్రీమియం, ZEE5 ప్రీమియం, మరిన్ని సహా OTT బండిల్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. మరోవైపు, రూ. 799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు నెలకు 3300 GB డేటా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 100mbps వేగాన్ని అందిస్తాయి. మొదటి నెల బిల్లుపై రూ. 500 వరకు 90శాతం డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 Series : అద్భుతమైన కెమెరాలతో రియల్‌మి 10 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?