Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పర్యాటకులకు గుడ్న్యూస్
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
Telangana government
- పర్యాటకుల కోసం డబుల్ డెక్కర్ బస్సులు
- నగరంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వినియోగం
- హెచ్ఎండీఏ నుంచి బస్సులను తీసుకోనున్న టూరిజం శాఖ
- అద్దె ప్రాతిపదికన అప్పగింతకు కసరత్తు
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని పర్యాటక రంగానికి మరింత శోభనిచ్చేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. నగరంలోని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తిరుగుతున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పర్యాటక అవసరాల కోసం వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల మధ్య ఈ బస్సులను తిప్పడం ద్వారా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు.
Also Read : మున్సిపల్ ఎన్నికల వేళ పొత్తుల రాజకీయం.. చివరకు ఎటువైపు?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను పునరుద్దరించాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ సుమారు రూ.12కోట్ల వ్యయంతో ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ బస్సులను నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్న పిల్లలు, మహిళలకు, పురుషులకు హెచ్ఎండీఏ ఉచితంగా నడుపుతోంది. ఈ పర్యావరణ రహిత ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. ప్రస్తుతం ఈ బస్సులను నగరంలోని పలు రూట్లలో తిప్పుతున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలోని ఆరు ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులను టూరిజం శాఖకు బదిలీ చేయించుకునేందుకు పర్యాటక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ బస్సులను పూర్తిగా కొనుగోలు చేయకుండా.. నెలవారీ కొంత మొత్తాన్ని అద్దె రూపంలో హెచ్ఎండీఏకు చెల్లించేందుకు టూరిజం అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల మధ్య ఈ బస్సులను తిప్పడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించనున్నారు. తద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించేలా చర్యలు చేపట్టనున్నారు.
హైదరాబాద్ నగరంలోని అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఆయా పర్యాటక ప్రాంతాలకు ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పడం ద్వారా పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు పర్యాటక శాఖ దృష్టిసారించింది.
