Redmi Note 12 Pro Plus 5G : 200MP కెమెరాతో రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Redmi Note 12 Pro Plus 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి నోట్ 12 సిరీస్‌లో మరో కొత్త మోడల్ వస్తోంది. వచ్చే ఏడాది (2023) జనవరి మొదటి వారంలో భారత మార్కెట్లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

Redmi Note 12 Pro Plus 5G : 200MP కెమెరాతో రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Redmi Note 12 Pro Plus 5G India launch date confirmed, coming with 200MP camera

Redmi Note 12 Pro Plus 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి నోట్ 12 సిరీస్‌లో మరో కొత్త మోడల్ వస్తోంది. వచ్చే ఏడాది (2023) జనవరి మొదటి వారంలో భారత మార్కెట్లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. జనవరి 5న రెడ్‌మి Note 12 Pro Plus 5G సిరీస్ వస్తుందని కంపెనీ అధికారిక ఇన్విటేషన్ వెల్లడించింది. Redmi Note 12 Pro Plus భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుందని మరో నివేదిక వెల్లడించింది.

ప్రస్తుతానికి, వచ్చే నెలలో దేశంలో మరిన్ని రెడ్‌మి నోట్ 12 (Redmi Note 12) మోడళ్లను లాంచ్ చేస్తుందో లేదో కంపెనీ వెల్లడించింది. లాంచ్ తేదీతో పాటు, స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ (Redmi Note 12 Pro Plus) 200MP ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుందని ధృవీకరించింది. రాబోయే రెడ్‌మి నోట్ 12 సిరీస్ (Redmi Note 12 Series) చైనీస్ మోడల్‌కు సమానంగా ఉండనుంది.

రెడ్‌మి Note 12 సిరీస్ ఇప్పటికే చైనాలో గత కొన్ని నెలలుగా అందుబాటులో ఉంది. నోట్ 12 ప్రో ప్లస్ మార్కెట్ సేల్ మొదలైంది. 200-MP కెమెరాతో రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ (Redmi Note 12Pro) ఇండియా మోడల్‌కు కంపెనీ ఇతర స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు.

Redmi Note 12 Pro Plus 5G India launch date confirmed, coming with 200MP camera

Redmi Note 12 Pro Plus 5G India launch date confirmed, coming with 200MP camera

Read Also : Redmi Note 12 Series : వచ్చే జనవరిలో రెడ్‌‌మి నోట్ 12 సిరీస్ వస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

చైనీస్ మోడల్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుందని నివేదిక చెబుతోంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Redmi Note 12 మోడల్ 6.67-అంగుళాల Full-HD OLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. MediaTek డైమెన్సిటీ 1080 SoCతో పాటు 12GB వరకు LPDDR4X RAMతో పనిచేస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో సపోర్టుతో రానుంది. కెమెరాల పరంగా.. Redmi Note 12 Pro Plus వెనుక ప్యానెల్‌లో 200-MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది.

సెల్ఫీలు, వీడియో కాల్‌లో స్మార్ట్‌ఫోన్‌లో పంచ్ హోల్ లోపల ఉండే 16-MP కెమెరా ఉంటుంది. రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్‌తో, కంపెనీ రియల్‌మి 10Pro Plus వంటి ఫోన్లనే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ధర రూ. 24999తో ప్రారంభం కానుంది. రెడ్‌మి నోట్ 12 ధరను కంపెనీ వెల్లడించలేదు. Pro Plus మోడల్ చైనాలో బేస్ (8GB RAM + 256GB) స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ CNY 2,099 (సుమారు రూ. 23,000)తో ప్రారంభమవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi K60 Series : వచ్చే జనవరిలో రెడ్‌మి K60 సిరీస్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!