BSNL Recharge Plan : జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా..!

BSNL Recharge Plan : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికం పోటీదారులు రీఛార్జ్ ప్లాన్‌లకు 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ. 250 లోపు ప్లాన్‌లకు 40 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

BSNL's new 45-day plan lures Jio, Airtel users with 2GB daily data

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇప్పటికే, ఇతర ప్రైవేట్ టెలికం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచేశాయి. ఇదే సమయంలో టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ ఇతర కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.

4జీ-5జీ నెట్‌వర్క్‌ వినియోగదారుల కోసం గత జూలై నుంచి అనేక ఆకర్షణీయమైన ఆప్షన్లను ప్రవేశపెడుతోంది. తాజాగా ఇప్పుడు ఒక నెలపాటు సర్వీసులను అందించే కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు వివిధ రకాల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. అందులో ఫ్రీ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్, ఇతర ఆకర్షణీయమైన ఫీచర్‌లను కూడా అందిస్తుంది.

జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికం పోటీదారులు చిన్న రీఛార్జ్ ప్లాన్‌లకు సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ. 250 లోపు ప్లాన్‌లకు 40 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ పోటీతో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వెనుక అడుగు వేసింది. బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును ఉపయోగిస్తున్న వారికి, ఈ లేటెస్ట్ రీఛార్జ్ ఆఫర్ అద్భుతమైన డీల్ కావచ్చు. బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ద్వారా రూ. 249 ధరతో బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది.

ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లో కస్టమర్‌లు తక్కువ ఖర్చుతో అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. ఇతర టెలికం కంపెనీలు ప్రీమియం వసూలు చేస్తాయి. ఈ ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ అన్ని నెట్‌వర్క్‌లలో పూర్తి 45 రోజుల పాటు ఫ్రీ కాలింగ్‌ను అందిస్తుంది. అదనంగా, కస్టమర్‌లు ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్ఎంఎస్ అందుకుంటారు. డేటా బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ మరింత బలంగా ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ రోజువారీ 2జీబీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు ఆందోళన లేకుండా మ్యూజిక్ స్ట్రీమింగ్, ఇతర ఆన్‌లైన్ ఎంటర్‌టైన్మెంట్ పొందడానికి అనుమతిస్తుంది.

ఈ కొత్త ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా ఉండగా, 2జీబీ లిమిట్ చేరుకున్న తర్వాత స్పీడ్ 40Kbpsకి తగ్గుతుంది. బీఎస్ఎన్ఎల్ లడఖ్, పొరుగు సరిహద్దు ప్రాంతాలలో 20 కొత్త లేదా అప్‌గ్రేడ్ చేసిన 4జీ టవర్‌లను రూపొందించింది. భారత సైన్యం కోసం నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు రెడీగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

Read Also : Zomato Food Rescue Feature : జొమాటో కొత్త ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ఇదిగో.. ఇకపై రద్దు చేసిన ఆర్డర్లపై డిస్కౌంట్‌ పొందవచ్చు!