Cardless Withdrawals : ఏటీఎంలో డబ్బులు తీయాలా? డెబిట్ కార్డుతో పనిలేదు.. ఈ 6 సింపుల్ స్టెప్స్ ద్వారా క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు..

Cardless Withdrawals : ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే డెబిట్ కార్డుతో పనిలేదు. యోనో యాప్ ద్వారా కార్డు లేకుండానే డబ్బులు తెచ్చుకోవచ్చు.

Cardless Withdrawals

Cardless Withdrawals : సాధారణంగా ఏటీఎంలో డబ్బులు తీయాలంటే డెబిట్ కార్డు ఉండాల్సిందే.. కానీ, ఇప్పుడు ప్రతిసారి ఏటీఎం దగ్గరకు డెబిట్ తీసుకెళ్లాల్సిన పనిలేదు. డెబిట్ కార్డు (Cardless Withdrawals) లేకుండా కూడా ఏటీఎంలో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

కొన్నిసార్లు చాలామంది డెబిట్ కార్డు మర్చిపోతుంటారు. డెబిట్ కార్డు పొగొట్టుకుంటామనో లేదా దొంగలు కొట్టేస్తారనో భయపడి వెంట తీసుకెళ్లరు. ఇలాంటి సందర్భాల్లో అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం కష్టంగా ఉంటుంది.

కొంతమందికి ఏటీఎం కార్డు ఉండదు. అయినప్పటికీ ఏటీఎం కార్డు లేకపోయినా సులభంగా ఏటీఎంలో సురక్షితంగా డబ్బులు తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యోనో (YONO) క్యాష్ ద్వారా డెబిట్ కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి క్యాష్ తీసుకునే సౌకర్యాన్ని వినియోగదారులకు అందించింది.

యోనో క్యాష్ ద్వారా మీరు SBI ATM నుంచి డబ్బును మాత్రమే తీసుకోలేరు. ఈ సౌకర్యం 2019లో ప్రారంభమైంది. ఇప్పుడు మరింత అప్‌గ్రేడ్ చేశారు. ఈ సర్వీసు దేశవ్యాప్తంగా 16,500 కన్నా ఎక్కువ ఎస్బీఐ ఏటీఎంలలో అందుబాటులో ఉంది.

Read Also : Apple M4 MacBook Air : కొత్త ల్యాప్‌టాప్ కావాలా..? ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!

యోనో క్యాష్ ద్వారా ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా ఎలా? :
1. 6 అంకెల MPIN లేదా యూజర్ ID/పాస్‌వర్డ్‌తో YONO SBI యాప్ లేదా YONO లైట్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
2. హోమ్‌పేజీలో ‘YONO Pay’ లో ‘YONO Cash’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3. ATM ఆప్షన్ ఎంచుకోవాలి. డబ్బును విత్‌డ్రా చేయాలనుకునే అకౌంట్ ఎంచుకోండి.
4. విత్‌డ్రా చేసే మొత్తాన్ని (రూ. 500 నుంచి రూ. 10,000 వరకు) ఎంటర్ చేసి 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను జనరేట్ చేయండి.
5. కన్ఫర్మేషన్ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్‌కు 6 అంకెల ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్‌ వస్తుంది. ఇది 4 గంటలు మాత్రమే చెల్లుతుంది.
6. మీ సమీపంలోని SBI ATMకి వెళ్లి, ‘YONO Cash’ ఆప్షన్ ఎంచుకోవాలి. లావాదేవీ నంబర్, మొత్తం అమౌంట్, పిన్ ఎంటర్ చేయండి. ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు. లావాదేవీ పూర్తయిన తర్వాత మీకు SMS, యాప్ నోటిఫికేషన్ వస్తుంది.

మీరు యూపీఐ క్యూఆర్ క్యాష్ ద్వారా కూడా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. యోనో యాప్‌లోని క్యాష్ విత్‌డ్రా సెక్షనుకు వెళ్లి ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి QR కోడ్‌ను జనరేట్ చేయండి. యూపీఐ ఎనేబుల్డ్ SBI ఏటీఎం వద్ద QR కోడ్‌ను స్కాన్ చేయండి. యూపీఐ ఐడీ, పిన్ ఎంటర్ చేయండి. క్యాష్ విత్‌డ్రా చేసుకోండి. లావాదేవీ నంబర్, పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయొద్దు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఆ మొత్తం 7 రోజుల్లో అకౌంటులో రీఫండ్ అవుతుంది.

ఒక రోజులో రూ. 20వేలు లిమిట్ :
ఈ సౌకర్యం ద్వారా ఒక రోజులో గరిష్టంగా రూ.20వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక లావాదేవీలో గరిష్టంగా రూ.10వేలు, కనీసం రూ.500 విత్‌డ్రా చేసుకోవచ్చు. యాప్ నుంచి ట్రాన్సాక్షన్ చేశాక అది 4 గంటలు మాత్రమే చెల్లుతుంది.