Waterproof Smartphones : వర్షంలో తడిసినా టెన్షన్ లేదు! రూ. 20వేల లోపు 5 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ ఫోన్లు ఇవే!
Cheapest Waterproof Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రూ. 20వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ చీపెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు ఫోన్ కావాలో ఎంచుకోండి.
- Sreehari A
- Updated on- June 14, 2026 / 01:27 PM IST
Cheapest Waterproof Smartphones ( Image Credit : AI )
- రూ.20వేల లోపు ధరలో టాప్ 5 చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లు
- చీపెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లలో ఏది కొంటారంటే?
- ఐపీ67, ఐపీ68 రేటింగ్లతో నీళ్లలో పడినా పనిచేస్తాయి
Cheapest Waterproof Smartphones : అసలే వర్షాకాలం.. వానలు జోరుగా పడుతున్నాయి.. బయటకు వెళ్లే ముందు మీ ఫోన్ జాగ్రత్త.. వర్షంలో ఫోన్ తడిసినా నీళ్లలో పడినా ఫోన్ పనిచేయదు.. అందుకే వర్షంలో తడిసినా కూడా ఫోన్ పనిచేయాలంటే వాటర్ ప్రూఫ్ ఫోన్లు తీసుకోవాల్సిందే.. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో చాలా వాటర్ ప్రూఫ్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అందులోనూ రూ. 20వేల లోపు ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.
ముఖ్యంగా కొన్ని ఫోన్లు అయితే IP67 / IP68 రేటింగ్‌తో వస్తున్నాయి. మీ బడ్జెట్ ధరలో ఫుల్ (Cheapest Waterproof Smartphones) వాటర్‌ప్రూఫ్ ఫోన్లు కాకపోయినా వర్షం, స్ప్లాష్‌లు, చిన్న నీటి తుంపరలు పడినా ఫోన్ పాడవ్వదు అనమాట. మీరు కూడా కొత్త వాటర్ ప్రూఫ్ కొనాలని చూస్తుంటే ప్రస్తుతం మార్కెట్లో లభించే టాప్ 5 వాటర్ ప్రూఫ్ ఫోన్లను ఓసారి లుక్కేయండి.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..
1. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ సెగ్మెంట్‌లో చాలా పవర్‌ఫుల్ ఫోన్. ఇందులో IP68 రేటింగ్ అందిస్తుంది. వర్షంలోనే కాదు.. నీళ్లలో ఎక్కువసేపు పడినా కూడా తట్టుకోగలదు. బైక్ మీద వెళ్లేటప్పుడు వర్షంలో కాల్స్ మాట్లాడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫీచర్ల విషయానికి వస్తే.. 6.6 నుంచి 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. బ్రైట్‌నెస్ హైగా ఉంటుంది. కలర్ రిచ్ విజువల్స్ బాగుంటాయి.
120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్ స్మూత్‌గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రోజువారీ యాప్స్, మల్టీటాస్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది. గేమింగ్ పరంగా చూస్తే మిడియం లెవెల్ అంతే.. మోటోరోలా ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ కారణంగా బ్లోట్‌వేర్ లేకుండా ఫోన్ ఫాస్ట్ రన్ అవుతుంది.
కెమెరా సెటప్ చాలా డీసెంట్.. డేలైట్ ఫొటోలు చాలా క్లియర్‌గా వస్తాయి. నైట్ మోడ్ కూడా పర్వాలేదు. బ్యాటరీ ఒక రోజు వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 18వేల నుంచి రూ. 20వేల మధ్య ఉంటుంది.
2. శాంసంగ్ గెలాక్సీ A35 5జీ :
శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ అద్భుతమైన మిడ్ రేంజ్ ఫోన్. IP67 వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. వర్షాలు, స్ప్లాష్‌లు, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. రోజువారీ వాడకానికి ఈ ఫోన్ చాలా సేఫ్ ఫోన్ అని చెప్పొచ్చు. 6.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఈ ఫోన్ కలర్ ఆప్షన్లు చాలా బ్రైట్‌గా షార్ప్‌గా ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రీన్ చాలా స్మూత్‌గా కనిపిస్తుంది. వర్షంలో కూడా డిస్‌ప్లే విజిబిలిటీ పనిచేస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా స్టేబుల్‌గా ఉంటుంది.
ఎక్సినోస్ చిప్‌తో సోషల్ మీడియా, యూట్యూబ్, యాప్స్ అన్నీ ఫాస్ట్ రన్ అవుతాయి. హీట్ మేనేజ్‌మెంట్ కూడా పర్వాలేదు. కెమెరా పరంగా చూస్తే 50MP మెయిన్ సెన్సార్‌తో వస్తుంది. డేలైట్ ఫొటోలు అద్భుతంగా వస్తాయి. పోర్ట్రెయిట్ మోడ్ కూడా చాలా క్లియర్ ఉంటుంది. 5000mAh బ్యాటరీ కూడా పెద్దదే.. ఒక రోజు వరకు ఛార్జింగ్ వస్తుంది. ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 18వేల నుంచి రూ. 20వేల మధ్య ఉంటుంది.
3. గూగుల్ పిక్సెల్ 7a :
గూగుల్ పిక్సెల్ 7ఎ ఫోన్ చూసేందుకు చాలా చిన్నదైనా పవర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ IP67 రేటింగ్ తో వస్తుంది. వర్షంలో వాడినా సేఫ్ అని చెప్పొచ్చు. కానీ, ఇందులో కెమెరా మాత్రం హైలైట్. ఫీచర్ల విషయానికి వస్తే.. 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. సైజ్ చిన్నదే అయినా షార్ప్ విజువల్స్ అందిస్తుంది.
Read Also : Apple iPhone 17 Pro : వారెవ్వా! ఖతర్నాక్ డిస్కౌంట్.. ఐఫోన్ 17 ప్రోపై ఏకంగా రూ. 22వేలు తగ్గింపు..!
గూగుల్ ఆప్టిమైజేషన్ కారణంగా ఈ ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది. కెమెరా పరంగా చూస్తే 64MP మెయిన్ కెమెరా ఈ రేంజ్‌లో టాప్. ఫొటోలు చాలా నేచురల్‌గా ఉంటాయి. వాతావరణం, వర్షం తర్వాత లైటింగ్ అన్ని వాతావరణ పరిస్థితుల్లో అద్భుతమైన అవుట్‌పుట్ అందిస్తుంది.
వీడియో, స్టెబిలైజేషన్ కూడా బాగుంది. టెన్సర్ చిప్‌తో ఏఐ ఫీచర్లు, వాయిస్, ఫొటో ఎడిటింగ్, కాల్ క్లారిటీ వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ, బ్యాటరీ పరంగా పరిశీలిస్తే ఒక రోజు కన్నా తక్కువే ఛార్జింగ్ వస్తుంది. ఛార్జింగ్ పదేపదే పెట్టాల్సి రావొచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ మార్కెట్ ధర రూ. 19వేల నుంచి రూ. 20వేల మధ్య ఉంటుంది.
4. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ :
ఈ శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీ ఫోన్ కూడా IP67 ప్రొటెక్షన్ అందిస్తుంది. వర్షంలో ప్రయాణించినా లేదా ట్రావెలింగ్ కోసం మంచి సేఫ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫోన్ డిస్‌ప్లే 6.7 అంగుళాల సూపర్ అమోల్డ్ + 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ కూడా చాలా హైగా ఉంటుంది. ఎండలో కూడా మీ ఫోన్ స్క్రీన్ క్లియర్‌గా చూడొచ్చు. అక్షరాలు బాగా కనపడతాయి.
ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ చూస్తే బ్యాలెన్స్‌గా ఉంటుంది. మల్టీటాస్కింగ్, యాప్స్ వాడేవారికి బెస్ట్ ఫోన్. శాంసంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ 4 నుంచి 5 ఏళ్ల వరకు ఉంటుంది. కెమెరా 50MP+అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. డేలైట్+పోర్ట్రెయిట్ ఫోటోలు అద్భుతంగా వస్తాయి. 5000mAh బ్యాటరీతో ఒక రోజు వరకు ఛార్జింగ్ వస్తుంది. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ.19వేల నుంచి రూ. 21వేల మధ్య లభిస్తుంది.
5. ఒప్పో రెనో 11F 5జీ :
ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ ఫోన్ పూర్తిగా IP67 రేటింగ్ కాదు. కానీ, IP65 స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. లైట్‌గా వర్షం పడటం, వాటర్ స్ప్లాష్‌ల వంటి ప్రొటెక్షన్ మాత్రమే అందిస్తుంది. అదే నీళ్లలో ఈ ఫోన్ పడితే ప్రొటెక్షన్ ఉండదు. ఒప్పో ఫోన్ ఫీచర్లలో 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. చాలా స్లిమ్ బాడీ, ప్రీమియం లుక్, చేతిలో పట్టుకునేందుకు చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
కెమెరా పరంగా చూస్తే.. 64MP మెయిన్ కెమెరాతో ఫొటోలు అద్భుతంగా వస్తాయి. సెల్ఫీ కెమెరా చాలా క్లియర్‌గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్‌గా అనిపిస్తుంది. డైలీ యాప్స్, వీడియోలు, ఫోన్ కాల్స్ చేసుకునేవారికి వెరీ స్మూత్ ఉంటుంది. హెవీ గేమింగ్ ఆడేవారికి సరిపోదు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినా ఒక రోజు కన్నా ఎక్కువ రాదు.. ఈ ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ ఫోన్ ధర రూ. 18వేల నుంచి రూ. 20వేల మధ్య ఉంటుంది.
