Maglev Bullet Train
Maglev Bullet Train : టెక్నాలజీ కింగ్ చైనా మరో సంచలనం.. మాగ్లెవ్ టెక్నాలజీతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసింది. కేవలం 2 సెకన్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ ఆవిష్కరించింది. సౌండ్ స్పీడ్ కన్నా వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ విజయవంతంగా పరీక్షించింది. చైనా బుల్లెట్ ట్రైన్ వేగాన్ని చూసి ప్రపంచ దేశాలు సైతం నివ్వెరపోతున్నాయి.
రాకెట్ లాంటి వేగంతో దూసుకెళ్లే ఈ బుల్లెట్ ట్రైన్ కేవలం 2 సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. చైనాకు చెందిన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ రీసెర్చర్లు ఈ సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ టెస్ట్ రైలును విజయవంతంగా పరీక్షించి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరారు.
గంటకు 700కి.మీ వేగం :
భారత మార్కెట్లో వందే భారత్ రైలు టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. చాలా మార్గాల్లో రైళ్లు గంటకు 130 కి.మీ నుంచి 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. అయితే, చైనా బుల్లెట్ ట్రైన్ మాత్రం గంటకు 700 కిమీ (435 మైళ్ళు) రికార్డు వేగాన్ని చేరుకునే అల్ట్రా-హై-స్పీడ్ మాగ్లెవ్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది.
ప్రయోగం ఎక్కడ? ఎలాగంటే? :
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ రీసెర్చర్లు 400 మీటర్ల (1,310-అడుగులు) మాగ్నెటిక్ లెవిటేషన్ టెస్ట్ లైన్‌లో కేవలం 2 సెకన్లలో ఒక టన్ను బరువున్న ట్రైన్ 700 కి.మీ/గం వేగంతో నడిపించి సురక్షితంగా ఆపారు. ఈ ప్రయోగంతో వేగంలో కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్‌గా నిలిచింది.
🇨🇳China leads the future!
🇨🇳🚄China set a global record by accelerating a ton-scale test maglev to 700 kilometers per hour in just two seconds.
Dedicated to maglev research for 10 years, the Chinese technicians have overcome core technical challenges. pic.twitter.com/F1Mv8dUZvc
— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) December 25, 2025
పదేళ్ల ప్రాజెక్ట్..
ఈ ప్రాజెక్టు కోసం ఆ బృందం 10 ఏళ్లు చాలా కృషి చేసింది. గత జనవరిలో అదే బృందం అదే టెస్ట్ లైన్‌లో గంటకు 648 కి.మీ. గరిష్ట వేగాన్ని సాధించింది. చైనాను అల్ట్రా-హై-స్పీడ్ మాగ్లెవ్ టెక్నాలజీలో ప్రపంచ అగ్రశ్రేణిలో నిలిపింది. హైపర్‌లూప్ రవాణాకు కొత్త అవకాశాలను అందించనుంది.
Read Also : Room Heaters Safe : రూమ్ హీటర్లు వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. చలికాలంలో హీటర్లు ఇలా వాడితే ప్రాణాంతకం..!
2023లో చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ థర్డ్ రీసెర్చ్ అకాడమీ, చైనా నార్త్ యూనివర్సిటీ సహకారంతో షాంగ్జీ ప్రావిన్స్‌లోని డాటాంగ్‌లో లో-వాక్యూమ్ పైప్‌లైన్‌లో సూపర్ కండక్టింగ్ మాగ్లెవ్ రైళ్లను నడిపేందుకు ప్రయోగాత్మక రైల్వే లైన్‌ను నిర్మించింది.
గంటకు 600 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించగల 2 కి.మీ (1.3-మైలు) ట్రాక్‌తో కూడిన ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో గత ఏడాది ఆగస్టులో ప్రయోగంలో ఉత్తీర్ణత సాధించింది. రెండో దశ ట్రాక్‌ను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టులో గరిష్ట డిజైన్ స్పీడ్ గంటకు 1,000 కి.మీగా నిర్ణయించింది.
విమానాల కన్నా అధిక వేగం :
ఈ మాగ్లెవ్ టెక్నాలజీ అనేది రాబోయే రోజుల్లో రవాణా విధానాన్ని పూర్తిగా మార్చేయనుందని అంచనా. ఇకపై ఎయిర్‌క్రాఫ్ట్, రాకెట్ల లాంచ్‌కు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీని వాడే అవకాశం ఉంది. తద్వారా ఇంధన ఖర్చు భారీగా తగ్గనుంది. మాగ్లెవ్ బుల్లెట్ ట్రైన్‌కు చక్రాలు ఉండవు. కేవలం అయస్కాంత శక్తి ద్వారా పట్టాలకు కొద్దిగా పైన గాలిలో తేలియాడుతూ పరుగులు పెడుతుంది. ఘర్షణ ఉండదు కారణంగా స్పీడ్ కూడా అంతకంతకూ పెరుగుతుంది.