కరోనాతో పోరాడేందుకు చైనా గబ్బిలం సూట్లు

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 09:23 AM IST
కరోనాతో పోరాడేందుకు చైనా గబ్బిలం సూట్లు

Updated On : April 28, 2020 / 9:23 AM IST

కరోనా వైరస్ కష్టాలు మామూలుగా లేవు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మాస్క్‌లు, గ్లౌజులు ధరిస్తున్నారు. ఇవి చాలదన్నట్లు ఇతరులను తాకడం కూడా మానేశారు. ఇక చైనాలో అయితే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బదులు పలకరించుకునేందుకు లెగ్ షేక్ వాడుతున్నారు. 

ఏ విషయాన్నైనా మరింత అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించే చైనా.. షీల్డ్ టైపులో గబ్బిలం సూట్లు తయారుచేస్తుంది. ప్రాణాంతక వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉపయోగపడుతుందని అంటున్నారు. బీజింగ్‌కు చెందిన ఫర్మ పెండా దీనిని డిజైన్ చేసింది. నిద్రపోతున్న గబ్బిలం ఆకారంలో సూట్ ఉంటుంది.

 

అల్ట్రా వయోలెట్ టెక్నాలజీ సాయంతో పరిసరాల నుంచి కాపాడుకోవడమే కాదు. వైరస్‌ను శరీరానికి చేరనివ్వదు.  ఈ షీల్డ్ పరిసరాల్లో ఉన్న అల్ట్రా వయోలెట్ రేడియేషన్‌కు హీట్ అవుతుంది. దాంతో దగ్గర్లో ఉన్న వైరస్ ఇతరులకు సోకకుండా చనిపోతుంది. పైగా దీనిని మడిచి పెట్టుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 70దేశాల ప్రజల్లో 90వేల మందికి వైరస్ సోకినట్లు సమాచారం.