Covid Diagnosis Using Whatsapp
XraySetu: కరోనా మహమ్మారి..ఇంకా భయపెడుతూనే ఉంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. భారతదేశంలో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతోంది. అయితే..వైరస్ ఉందా లేదా ? అనేది చెక్ చేసుకోవడానికి కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వారికి త్వరగా చికిత్స అందడం లేదు. సిటీ స్కానింగ్ తో రేడియేషన్ భయం, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి.
ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినా..స్కానింగ్ లో ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ గుర్తించిన సందర్భాలున్నాయి. ఎక్స్ రేను ఉపయోగించి..కరోనా నిర్ధారణ చేసే టెక్నాలజీని బెంగళూరుకు చెందిన ఆర్ట్ కార్ట్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని ‘ఎక్స్‌రేసేతు’ అని పిలుస్తున్నారు. ఎక్స్‌రేల ఫొటోలను వాట్సాప్ ద్వారా www. xraysetu.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కేవలం 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది. అంతేగాకుండా..కొవిడ్‌తో పాటు టీబీ, న్యుమోనియా లాంటి 14 రకాల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లను గుర్తిస్తుంది.
ఎలా చూడాలి.
– డాక్టర్ www. xraysetu.com లోకి ఎంటర్ కావాలి.
– ఎక్స్‌రే సేతు బీటా బటన్‌పై క్లిక్ చేయాలి.
– వాట్సాప్ చాట్‌బాక్స్ ఓపెన్ అవుతుంది.
– +91 80461638638 నంబర్‌కు వాట్సాప్ చేయాలి.
– ఎక్స్‌రే సేతు సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.
– తర్వాత ఎక్స్‌రేను వాట్సాప్ చేయాలి.
– 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది.
Read More : Dry Swab Test : గుడ్ న్యూస్.. కేవలం రూ.60కే కరోనా టెస్ట్.. 3 గంటల్లోనే రిజల్ట్