DarkWeb Hacker Forum: ఫేస్‌బుక్‌ యూజర్లకు మరో షాక్‌..!

ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సర్వీసులు ఒక్కసారిగా స్తంభించిన నేపథ్యంలో యూజర్లకు మరో షాక్ తగిలింది. ఫేస్ బుక్ యూజర్ల డేటాను హ్యాకర్లు విక్రయించినట్టు ఓ నివేదక వెల్లడించింది

Data Of Over 1.5 Billion Facebook Users Sold On Hacker Forum

Facebook Users Data Sold on Hacker Forum : ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సర్వీసులు ఒక్కసారిగా స్తంభించిన నేపథ్యంలో యూజర్లకు మరో షాక్ తగిలింది. ఫేస్ బుక్ యూజర్ల డేటాను హ్యాకర్లు విక్రయించినట్టు ఓ నివేదక వెల్లడించింది. ఫేస్‌బుక్ గ్లోబల్ నెట్ వర్క్స్‌కు తీవ్ర అంతరాయం కలిగిన సమయంలో హ్యాకర్లు ఫేస్ బుక్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ హ్యాకర్ ఫోరమ్ (Hacker Forum)లో విక్రయించినట్టు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ (Russian Privacy Affairs) వెల్లడించింది. ఫేస్‌బుక్‌ యూజర్ల అడ్రస్, పేరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లను విక్రయానికి ఉంచినట్లు సమాచారం.

Read Also :  Facebook Outage : ఆమె లైవ్‌లో కనిపించింది అంతే.. క్షణాల్లో ఫేస్‌బుక్ సర్వీసులన్నీ బంద్..!

నివేదిక ప్రకారం.. దాదాపు 1.5 బిలియన్ ఫేస్‌బుక్‌ యూజర్ల అకౌంట్లు డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు రష్యన్‌ ప్రైవసీ అఫైర్స్‌ షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఒక్కసారిగా డౌన్‌ అవ్వడంతో అనేక మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 7 గంటల పాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నెట్‌వర్క్‌ పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్స్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నిలిచిపోయినట్టు ఫేస్ బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫేస్‌బుక్‌ సీఈఓ జుకర్ బర్గ్ కూడా యూజర్లకు క్షమాపణలు తెలియజేశారు.

సాధ్యమైనంత తొందరగా సర్వీసులను పునరుద్దరిస్తామని చెప్పారు. అనంతరం ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను తిరిగి మాన్యువల్‌గా పునరుద్ధరించేందుకు సుమారు 7 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. ఫేస్‌బుక్‌ సర్వర్లు డౌన్‌ అవ్వడంతో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకమ్‌బర్గ్‌ సుమారు 7 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టపోయాడని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. కొంతమంది హ్యాకర్లు ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు నివేదిక బయటపెట్టింది. ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను డార్క్‌వెబ్‌లో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి హ్యాకర్లనుంచి 5వేల డాలర్లను చెల్లించినట్టు గుర్తించింది.

అయితే డార్క్ వెబ్ నుంచి ఎలాంటి డేటాను తిరిగి పొందలేదని ఆ వ్యక్తి రిపోర్ట్‌చేసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ చివరలో హ్యాకర్లు 1.5 బిలియన్ ఫేస్‌బుక్ యూజర్ డేటా ఉందంటూ పోస్ట్ పెట్టడం ఆందోళన రేకిత్తించింది. మరోవైపు.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ అయిన సమయంలో యూజర్ల డేటా లీక్‌ అవ్వలేదంటూ ఫేస్‌బుక్‌ ప్రకటనలో స్పష్టం చేసింది. యూజర్ల డేటాకు ఎలాంటి డోకా లేదని సమర్థించుకుంది. యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఫేస్‌బుక్‌ పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.
Mark Zuckerberg: ఆరు గంటలు ఆగిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్.. ఆరొందల కోట్ల డాలర్ల నష్టం