Telugu » Technology » Dhanteras Sale Xiaomi Samsung More 43 Inch Smart Tvs Slashed To Half Price Check Full Details Sh
Dhanteras Sale : ధన్‌తేరాస్ సేల్.. షావోమీ, శాంసంగ్ 43 అంగుళాల స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లు.. సగం ధరకే కొనేసుకోండి..!
Dhanteras Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ దీపావళి సేల్ సమయంలో షావోమీ, శాంసంగ్ సహా స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.
Dhanteras Sale : అమెజాన్ దీపావళి సేల్ సమయంలో 43-అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కొన్ని మోడళ్లు సగం కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ధన్‌తేరాస్‌లో కొనుగోలు చేస్తే అదనపు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ధంతేరాస్ 43-అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే.. అమెజాన్‌లో దీపావళి సేల్ సమయంలో తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.
2/6
ఈ సేల్ సమయంలో అనేక బ్రాండ్ల నుంచి స్మార్ట్ టీవీలు సగం కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. తోషిబా, టీసీఎల్, శాంసంగ్, షావోమీ వంటి బ్రాండ్లు అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌టీవీలను తక్కువ ధరకే విక్రయిస్తున్నాయి. మీరు కూడా కొత్త స్మార్ట్‌టీవీ కొనాలంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు.
3/6
అమెజాన్‌లో టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ : తోషిబా : మీరు తోషిబా 43-అంగుళాల 4K యూహెచ్‌డీ స్మార్ట్ టీవీని కేవలం రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ధరను కంపెనీ రూ.20వేలు తగ్గించింది. అదనంగా, రూ.3వేలు వరకు బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు రూ.16,999 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. డల్‌బై డిజిటల్, HDR10, హెచ్ఎల్‌జీ కలిగి ఉంటుంది.
4/6
షావోమీ : షావోమీ టీవీ ఎఫ్ఎక్స్ ప్రో మోడల్‌పై రూ.3వేలు సేవ్ చేసుకోవచ్చు. రూ.1,500 కూపన్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. ఈ 43-అంగుళాల షావోమీ స్మార్ట్ టీవీ 47 శాతం డిస్కౌంట్‌తో రూ.23,999కు లభిస్తుంది. అన్ని డిస్కౌంట్ల తర్వాత రూ.20,999కు లభిస్తుంది.
5/6
శాంసంగ్ : మీరు శాంసంగ్ 43-అంగుళాల విజన్ ఏఐ 4K UHD స్మార్ట్‌టీవీ 39 శాతం తగ్గింపుతో కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ రూ.33,490కి లిస్ట్ అయింది. ఈ టీవీ ధర రూ.21వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందింది. మీరు శాంసంగ్ కొనుగోలుపై రూ.3వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
6/6
ఫిలిప్స్ : ఫిలిప్స్ 43-అంగుళాల క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ.21,499కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.29,999 ఉండగా, అదనంగా రూ.3వేలు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. దీపావళి, ధంతేరాస్ సీజన్‌లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.