Diwali 2025 Buying Guide
Diwali 2025 Buying Guide : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత ఈ నెల (అక్టోబర్) 11న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 ప్రారంభం కానుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (దీపావళి ఎడిషన్) ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ సీజన్‌లో ఈ రెండు సేల్స్ అత్యంత డిమాండ్ (Diwali 2025 Buying Guide) ఉన్న ఐఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ 16, గత నెలలో వచ్చిన కొత్త ఐఫోన్ 17 రెండు ఐఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ అక్టోబర్ 11న ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులు అక్టోబర్ 10న ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. మీరు ఐఫోన్ 16, ఐఫోన్ 17 మధ్య కొనాలని భావిస్తుంటే.. ఈ పండుగ సీజన్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 16 vs ఐఫోన్ 17 ధర :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ధర రూ.79,900కు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం దీపావళి సేల్ సందర్భంగా అమెజాన్‌లో రూ.66,990కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇంకా సేల్ ధరను వెల్లడించలేదు. కానీ, బిగ్ బిలియన్ డేస్ సమయంలో ఈ ఐఫోన్ 16 రూ.65,999కు లభ్యమవుతుంది. రాబోయే సేల్‌లో కూడా ఇదే ధరకు లభించవచ్చు.
ఐఫోన్ 17 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ రూ.82,900 వద్ద లిస్ట్ అయింది. లాంచ్ తర్వాత భారీగా తగ్గింపు ఉండకపోవచ్చు. కానీ, బ్యాంక్ ఆఫర్‌లతో ధరను దాదాపు రూ.79,999కు తగ్గించవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.3వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
Read Also : iPhone 17 Discount : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఆపిల్ ఐఫోన్ 17 చాలా చీప్ గురూ.. ఈ ఐఫోన్ ఎందుకు కొనాలంటే?
ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. A19 చిప్‌పై రన్ అవుతుంది. 8GB ర్యామ్, ఆపిల్ కస్టమ్ Wi-Fi 7 చిప్‌తో వస్తుంది. ఐఫోన్ 16తో పోలిస్తే 3692mAh బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. 6 అదనపు గంటల వరకు ఛార్జింగ్ అందిస్తుంది.
కెమెరా ఫ్రంట్ సైడ్ పరిశీలిస్తే.. ఆపిల్ డ్యూయల్-లెన్స్ సెటప్, 48MP ఫ్యూజన్ ప్రైమరీ, 12MP టెలిఫోటోతో వస్తుంది. కానీ, కొత్త 18MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు అద్భుతంగా వస్తాయి. 4K రికార్డింగ్, 2x ఆప్టికల్ జూమ్‌కు సపోర్టు ఇస్తుంది. కంటెంట్ క్రియేషన్‌కు ఆల్-రౌండర్ అని చెప్పొచ్చు.
ఐఫోన్ 16 ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. A18 బయోనిక్ చిప్‌తో వస్తుంది. 8GB ర్యామ్ కూడా ఉంది. 48MP + 12MP కెమెరా సెటప్, 12MP సెల్ఫీ కెమెరాతో ఐఫోన్ 17 ఫీచర్లకు సమానంగా ఉంటుంది. రోజువారీ వినియోగానికి 3561mAh బ్యాటరీ, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.
ఏది కొనాలంటే? :
లేటెస్ట్ ఫీచర్లు, 120Hz డిస్‌ప్లే, Wi-Fi 7, స్క్రీన్, సెల్ఫీ కెమెరా కోసం చూస్తుంటే.. ఐఫోన్ 17 కొనేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో అయితే, రూ. 65వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్ 16 కొనేసుకోవచ్చు. అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన డిస్‌ప్లే, కెమెరాలతో డిస్కౌంట్ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా ఈ పండుగ సీజన్ కొత్త ఫోన్ కొనేందుకు బెస్ట్ టైమ్. ఐఫోన్ 17 లేదా ఐఫోన్ 16 రెండింటిలో ఏదైనా కొనేసుకోవచ్చు.