Don't want your phone company to collect your SMS, call and other data
Phone Personal Data : మీరు వాడే ఫోన్ ఏదైనా సరే.. ఆ ఫోన్ కంపెనీ మీకు తెలియకుండానే మీ పర్సనల్ డేటాను సేకరిస్తుందని ఎప్పుడైనా గమనించారా? ప్రత్యేకించి చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజాలైన Realme, OnePlus, Oppo తయారీ కంపెనీలు తమ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, మీ ఫోన్‌ను మరింత ఆప్టిమైజ్ చేయడానికి మీ వ్యక్తిగత డేటాలో కొంత భాగాన్ని సేకరిస్తున్నాయి. మీ ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని భావిస్తే.. మీ ఫోన్ కంపనీలు మీ డేటాను సేకరించకుండా ఆపవచ్చు. ఇంతకీ అది ఎలాగంటే.. ఇప్పుడు తెలుసుందాం..
సాధారణంగా చాలా ఫోన్ కంపెనీలు తమ యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి, మీ ఫోన్‌ను ఆప్టిమైజ్ చేసేందుకు Realme, OnePlus, Oppo వంటి కంపెనీలు మీ వ్యక్తిగత డేటాలో కొంత భాగాన్ని సేకరిస్తున్నాయని తేలింది. అయితే, ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఈ ఆప్షన్ డిసేబుల్ చేయడానికి ఒక మార్గం ఉంది. మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీస్ అనే ఫీచర్ ఉంది. ఇది డిఫాల్ట్‌గా పైన పేర్కొన్న కంపెనీల ద్వారా ఫోన్‌లలో అందుబాటులో ఉంది.
ప్రైవసీ విషయంలో ఆందోళన చెందే వినియోగదారులు మీ ఫోన్ సెట్టింగ్‌ల సెక్షన్‌లో ఈ ఆప్షన్ వెంటనే ఆఫ్ చేయవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మీ SMS, కాల్, ఇతర డేటాను పొందాలని క్లెయిమ్ చేస్తూ ట్విట్టర్‌లో యూజర్ ఈ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన తర్వాత డేటా సేకరణ సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ సమస్య (Realme) ఫోన్ యూజర్లు లేవనెత్తినందున, భారత ఐటీ మంత్రి దృష్టికి వచ్చింది. డేటా పూర్తిగా డివైజ్‌లో స్టోర్ అయిందని, అది మరెక్కడా షేర్ కాదని, లేదా క్లౌడ్‌లో అప్‌లోడ్ చేసే వీలు కాదని కంపెనీ క్లారిటీ ఇచ్చింది కూడా.
వినియోగదారులు మెరుగైన బ్యాటరీ లైఫ్, ఉష్ణోగ్రత పనితీరును పొందేలా డివైజ్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసేందుకు మెరుగుపరిచిన ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఫీచర్ లింక్ అయిందని చెప్పవచ్చు. అయితే, ప్రస్తుత వివరణకు విరుద్ధంగా.. SMS, ఫోన్ కాల్‌లు, షెడ్యూల్‌లు మొదలైనవాటిలో ఏ డేటాను కనెక్ట్ చేయదు. ఈ సర్వీసులో ప్రాసెస్ చేసిన మొత్తం డేటా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. కచ్చితంగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ విధానాలకు అనుగుణంగా యూజర్ డివైజ్‌లో ఎన్‌క్రిప్టెడ్ హార్డ్‌వేర్‌లో స్టోర్ అవుతుంది. ఈ డేటా పూర్తిగా డివైజ్‌లో మాత్రమే స్టోర్ అవుతుంది. మరెక్కడా షేర్ కాదు లేదా క్లౌడ్‌లో అప్‌లోడ్ కాదు. యూజర్ ప్రైవసీ ప్రొటెక్షన్‌పై ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని తెలిపింది. యూజర్ల అవసరాల ఆధారంగా మెరుగుపరిచిన ఇంటెలిజెంట్ సర్వీసుల ఫీచర్‌ను మాన్యువల్‌గా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చునని రియల్‌మి తెలిపింది.
Phone Personal Data : Don’t want your phone company to collect your SMS, call and other data
మీ ఫోన్ మీ SMS, కాల్, ఇతర డేటాను కలెక్ట్ చేయకూడదా? ఎలా డిసేబుల్ చేయాలంటే?
మీరు ముందుగా మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. అదనపు సెట్టింగ్‌లపై నొక్కండి. సిస్టమ్ సర్వీసులను ఎంచుకోండి. ఇప్పుడు, మెరుగుపరిచిన సిస్టమ్ సర్వీసుల ఆప్షన్ టోగుల్ చేయండి (డిసేబుల్ చేయండి). మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి.
ఏమి గుర్తుంచుకోవాలంటే? :
మీరు కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌ని కొనుగోలు చేసి.. సెటప్ చేసిన ప్రతిసారీ, మీకు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఒకటి ఫోన్ కండిషన్ లేదా యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి ఫోన్ డేటా, ఇతర డేటాను సేకరించడానికి మీ అనుమతిని అడుగుతుంది. కానీ, మీ వ్యక్తిగత డేటాను షేర్ చేయడం మీకు సౌకర్యంగా లేకుంటే.. మీరు గూగుల్ సర్వీసులకు Send usage and diagnostic data’ వంటి ఆప్షన్లను నిలిపివేయాలి. మీ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి అని గూగుల్ చెబుతోంది. కానీ, చాలా మంది యూజర్లు దీనితో సౌకర్యంగా లేరు. డిసేబుల్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. అదేవిధంగా, స్మార్ట్‌ఫోన్ OEMలు ఫోన్ మొత్తం పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ మెరుగుపరచడానికి అనేక ఆప్షన్లను కూడా అందిస్తాయి.