Elon Musk Twitter : ట్విటర్ లో కొత్త రూల్..! ఏడాదికి ఒక యూఎస్ డాలర్ కట్టాల్సిందేనా..

ట్విటర్ (ఎక్స్) నూతనంగా తీసుకొచ్చిన ఈ నిబంధనలను తొలుత న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేయనుంది. స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విటర్ తెలిపింది.

Twitter: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (ఎక్స్) వినియోగదారులకు షాకిచ్చింది. ‘నాట్ ఎ బాట్’ అని పిలువబడే కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విటర్ కొత్త యూజర్లు లైక్, రీ పోస్ట్, ఖాతాలో పోస్ట్, బుక్ మార్క్ పోస్టులు చేయాలంటే వినియోగదారులు నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్ స్క్రిప్షన్ ఫీజు ఏడాదికి ఒక యూఎస్ డాలర్ గా ట్విటర్ యాజమాన్యం పేర్కొంది. అయితే, దీనిని తొలుత రెండు దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

Read Also : Twitter: ట్విటర్‌లో సాంకేతిక సమస్య.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్‌

ట్విటర్ (ఎక్స్) నూతనంగా తీసుకొచ్చిన ఈ నిబంధనలను తొలుత న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేయనుంది. స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విటర్ తెలిపింది. అయితే, ఈ సబ్ స్క్రిప్షన్ మోడల్ ప్రకారం.. కొత్తగా ట్విటర్ (ఎక్స్) ఖతా తెరిచే యూజర్లు మాత్రమే ఏడాది ఒక డాలర్ చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ వెర్షన్ లో ఇతరుల సందేశాలకు రీపోస్ట్ చేయడం, లైక్ కొట్టడం, బుక్ మార్క్ చేయడం ఇతరుల ఖాతాలను మెన్షన్ చేయడం వంటి బేసిక్ ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఖాతా తెరిచి పోస్టులను చదవడం, ఫొటోలు, వీడియోలు చూడటానికి మాత్రం ఎలాంటి రుసుము అవసరం లేదు. ప్రస్తుతానికి దీన్ని కొత్త యూజర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.  అయితే, ఇందుకు సంబంధించిన రుసుము ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Nara Bhuvaneshwari :ఇదేమి చట్టం.. దేశంలో మరెక్కడైనా ఇలా ఉంటుందా? తల్లి వర్ధంతి కార్యక్రమానికి కూడా వెళ్లనివ్వరా..

గతేడాది ట్విటర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ కు బాట్ లు వివాదాస్పద అంశంగా మారాయి. ఈ ఏడాది జులైలో ట్విటర్ తన యూజర్ బేస్ యొక్క ప్రామాణికతను నిర్ధారించడానికి ట్వీట్లను వీక్షించడంపై పరిమితిని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల ప్రారంభంలో ట్విటర్ సీఈఓ లిండా యాకారినో ట్విటర్ ఇన్వెస్టర్స్ తో సమావేశం అయినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు, వాటిని అమలు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు