SIM Swapping Scam : సిమ్ స్వాపింగ్ స్కామ్‌‌తో జాగ్రత్త.. అసలు ఈ స్కామ్ ఏంటి? మిమ్మల్ని మీరు ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు!

SIM Swapping Scam : సిమ్ స్వాపింగ్ స్కామ్‌‌తో జాగ్రత్త.. స్కామర్ మీ SIM కార్డ్‌కు మీకు తెలియకుండానే యాక్సెస్‌ను చేయగలడు. మీ ఫోన్ నంబర్‌ను వారి వద్ద ఉన్న SIM కార్డ్‌కి లింక్ చేయడమే సిమ్ స్వాపింగ్ స్కామ్ అని పిలుస్తారు.

SIM Swapping Scam : ప్రస్తుత రోజుల్లో స్కామర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ యూజర్లను వారికి తెలియకుండానే ‘సిమ్ స్వాపింగ్ స్కామ్’ ద్వారా మోసం చేస్తున్నారు. ఈ స్కామ్ కారణంగా చాలామంది బాధితులు లక్షల రూపాయలు కోల్పోయారు. నివేదిక ప్రకారం.. మహిళకు తెలియని నంబర్ నుంచి 3 మిస్డ్ కాల్‌లు వచ్చాయి. ఆమె వేరే నంబర్ నుంచి తిరిగి కాల్ చేసింది. అప్పుడు ఆ వ్యక్తి కొరియర్ కాల్ అని నమ్మబలికాడు. 35 ఏళ్ల మహిళ తన ఇంటి అడ్రస్ సహా వ్యక్తిగత వివరాలను ఫోన్ చేసిన వ్యక్తికి షేర్ చేసింది.

Read Also : Apple iPad Discount : 10వ జనరేషన్ ఐప్యాడ్‌పై ఆపిల్ అదిరే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

వివరాలను షేర్ చేసిన తర్వాత తన బ్యాంక్ నుంచి రెండు లావాదేవీల నోటిఫికేషన్‌లను పొందినట్లు నివేదించారు. ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వంటి ఎలాంటి సమాచారాన్ని సదరు మహిళ స్కామర్‌తో షేర్ చేయలేదని ఢిల్లీ పోలీసు సైబర్ విభాగం తెలిపింది. ఇది ఎలా జరిగిందంటే.. సిమ్ స్వాపింగ్ స్కామ్.. దీని కారణంగా ఆమె మొబైల్ నెంబర్ ఆమె తెలియకుండానే మరో సిమ్‌కు లింక్ చేసిన స్కామర్లు ఆమె బ్యాంకులో డబ్బులను కాజేశారు.

సిమ్ స్వాపింగ్ స్కామ్ అంటే ఏమిటి? :

స్కామర్ మీ SIM కార్డ్‌కి యాక్సెస్‌ని పొందడమే సిమ్ స్వాపింగ్ స్కామ్.. తమ వద్ద ఉన్న సిమ్ కార్డ్‌కి మీ నంబర్‌ను లింక్ చేసేలా నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను మోసగిస్తారు. స్కామర్‌లు మీ ఫోన్ నంబర్‌పై కంట్రోల్ పొందిన తర్వాత, ఎవరైనా ఈ నంబర్‌కు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా స్కామర్‌ల డివైజ్‌కు కనెక్ట్ అవుతారు. స్కామర్‌లకు టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ అధిగమించడానికి బ్యాంక్ పంపిన OTPలకు యాక్సెస్‌ను పొందడానికి సాయపడుతుంది.

మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? :

గుర్తుంచుకోవలసిన కొన్ని ప్రాథమిక అంశాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
– మీకు అనుమానాస్పదంగా అనిపించే వ్యక్తిని ఎప్పుడూ నమ్మొద్దు.
– మీ సిమ్ కార్డ్ లాక్ అయిందా? లేదా నో వ్యాలీడ్ అని ఎర్రర్ మెసేజ్‌ కనిపిస్తే.. వెంటనే మీ సర్వీస్ ప్రొవైడర్‌ని సంప్రదించి, మీ నంబర్‌ని బ్లాక్ చేయండి.
– మీరు సిమ్ లాక్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. మీ వివరాలను సురక్షితంగా ఉండేలా సాయపడుతుంది.
– మీ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను బ్లాక్ చేయండి.
– క్రమం తప్పకుండా మీ పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండండి.
– మీ అకౌంట్ వివరాలను చెక్ చేయండి.
– ఏదైనా మోసపూరిత లావాదేవీల విషయంలో మీరు వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి.
– మీరు టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ సెక్యూరిటీ ఫీచర్‌ను ఎంచుకోవచ్చు.
– మీ వివరాలను సురక్షితంగా ఉంచడంలో సాయపడుతుంది.

SIM Swapping Scam  

పాస్‌వర్డ్‌లను క్రాక్ చేసేందుకు ఎంత సమయం పడుతుంది? :
ఇటీవల, పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పాస్‌వర్డ్‌లను క్రాక్ చేసేందుకు హ్యాకర్ ఎంత సమయం తీసుకుంటాడు అనే దానిపై మాట్లాడారు. పాస్‌వర్డ్‌ల ప్రాముఖ్యత గురించి ఆయన చెప్పారు. అంతేకాదు.. పాస్‌వర్డ్ లెన్త్ చాలా ముఖ్యమైనదని (X) వేదికగా చార్ట్‌ను శర్మ షేర్ చేశాడు. పాస్‌వర్డ్ లెన్త్ చాలా ముఖ్యమైనది. అందులో కొన్ని స్మాల్, షార్ట్ క్యాపిటల్ లెటర్స్ ఉండేలా చూసుకోవాలి. నంబర్-ఓన్లీ పాస్‌వర్డ్‌ల కోసం హ్యాకర్ తీసుకునే సమయం క్యారెక్టర్‌లను బట్టి అప్పటికప్పుడు నుంచి 6 రోజుల వరకు మారవచ్చు.

Read Also : 5 Upcoming SUVs in India : 2024లో రాబోయే 5 టాప్ SUV కారు మోడల్స్ ఇవే.. పూర్తి వివరాలు మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు