facebook-messenger
Facebook Messenger: ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టే దిశగా అడుగులేస్తుంది ఫేస్‌బుక్. ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ నెట్ వర్క్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో మనం చాట్ ను స్క్రీన్ షాట్స్ తీస్తే.. వెంటనే అలర్ట్ వచ్చేస్తుందట.
ఈ మేరకు ‘డిసప్పీయర్ మెసేజెస్ ని స్క్రీన్ షాట్ తీసుకున్నా మీ దృష్టికి తీసుకురావాలనేదే మా ఉద్దేశ్యం’ అని మెటా ప్రకటనలో వెల్లడించింది.
* ఫేస్‌బుక్ మెసేంజర్ లో ఫార్వార్డ్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్, ఇన్ స్టాలో మాదిరిగా ఇకపై లాంగ్ ప్రెస్ చేసి ఫార్వార్డ్ చేసుకోవచ్చన్నమాట.
* ఇతరుల నుంచి మనకొచ్చిన మెసేజెస్, ఫొటోస్, వీడియోలను లాంగ్ ప్రెస్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు.
* మల్టీమీడియా ఫైల్స్ పంపుకునే ముందు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. వీడియోలకు ఆడియో యాడ్ చేసి కూడా పంపొచ్చు.
* అంతేకాకుండా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌ట్ చాట్స్‌కి వెరిఫైడ్ బ్యాడ్స్ ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది.