Ray-Ban Stories : ఫేస్‌బుక్ నుంచి ఫస్ట్ స్మార్ట్ కళ్లజోళ్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

ఫేస్ బుక్ మొట్టమొదటి స్మార్ట్ కళ్లజోళ్లను Ray-Ban Stories పేరుతో లాంచ్ చేసింది. అదిరే ఫీచర్లతో స్మార్ట్ కళ్లద్దాలు మెరిసిపోతున్నాయి. అబ్బా.. అదొక్కటే మిస్సింగ్.. ఉంటే బాగుండేది.

Facebook, Ray-Ban launch first smart glasses : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మొట్టమొదటి స్మార్ట్ కళ్లజోళ్లను లాంచ్ చేసింది. Ray-Ban Stories పేరుతో జూకర్ బర్గ్ కంపెనీ సేల్స్ కూడా మొదలుపెట్టేసింది. అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ కళ్లద్దాలు మెరిసిపోతున్నాయి. ఈ ఫీచర్లను చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.. టచ్ చేయకుండానే ఫొటోలు తీసుకోవచ్చు.. వీడియోలు తీయొచ్చు.. కాల్స్ కూడా మాట్లాడొచ్చు.. అబ్బా.. అదొక్కటి ఉంటే బాగుండేది కదా.. దొంగచాటుగా మాత్రం ఫొటోలు తీయలేమట.. ఎందుకంటే.. ఇందులో ఇన్ బిల్ట్ LED లైట్ సెటప్ ఉందట.. క్యాప్చర్ కొడితే చాలు.. ఫ్లాష్ వస్తుంది. పేరుకే స్మార్ట్‌ కళ్లజోడు.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ (AI) సిస్టమ్ సపోర్ట్‌ కూడా లేదంట..

అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే? 
ఫేస్ బుక్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. ఆడియోను రికార్డు చేసేందుకు మూడు చిన్నపాటి మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి. అంతేకాదు.. మీ ఫోన్ కనెక్ట్ చేసుకుని ఫేస్ బుక్ స్మార్ట్ కళ్లజోళ్లతో వీడియోలను కూడా చూడొచ్చు. ఈ స్మార్ట్ కళ్లజోళ్ల ద్వారా రికార్డు చేసిన వీడియోలను కనెక్ట్ చేసిన స్మార్ట్ ఫోన్లలో సేవ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోలను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇందులోని 5MP కెమెరా ఫొటోలు అద్భుతంగా వస్తాయి. అలాగే 30 సెకన్ల వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.
Airtel New Data Pack : ఎయిర్‌టెల్‌ అదిరే ఆఫర్.. డేటా దాహం తీర్చే Top-Up ప్లాన్‌‌‌!

స్మార్ట్‌ కళ్లజోడు.. రే-బాన్‌ బ్రాండ్‌ భాగస్వామ్యంతో ఫేస్‌బుక్ తయారుచేసిందంట.. ఇప్పటివరకూ మార్కెట్లోకి Ray-Ban Stories స్మార్ట్‌ కళ్లజోళ్లు మొత్తం 20 రకాల వరకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్. అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, ఐర్లాండ్‌, ఇటలీ, యూకేలో సేల్ మొదలైంది. ఆన్‌లైన్‌తో ఆప్షన్ కలిగిన రిటైల్‌ స్టోర్‌లలో ఫేస్‌బుక్‌ స్మార్ట్‌ కళ్లద్దాలను విక్రయిస్తోంది. ఇంతకీ ఈ ఫేస్ బుక్ స్మార్ట్ గ్లాసుల ప్రారంభ ధర 299 డాలర్లు (దాదాపు రూ.22 వేలు)గా ఉంది.

ఫేషియల్‌ రికగ్నిషన్‌ (facial recognition) టెక్నాలజీ సహా AI Tools వంటి వివాదాల్లో చిక్కుకున్న ఫేస్‌బుక్‌.. తన సొంత ప్రొడక్టు Ray-Ban Stories విషయంలో AI టెక్నాలజీని వినియోగించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2020లో 86 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్నిఫేస్‌బుక్‌ ఆర్జించింది. చాలా వాటాను అడ్వర్‌టైజింగ్‌ ద్వారానే సంపాదించింది. ఇప్పుడు ఆ ఆదాయాన్ని వర్చువల్‌ అండ్‌ అగుమెంటెడ్‌ రియాలిటీ(AR), హార్డ్‌వేర్‌ డెవలపింగ్‌ (ఓక్యూలస్‌ వీఆర్‌ హెడ్‌సెట్స్‌, రిస్ట్‌బ్యాండ్‌లు)లకు తిరిగి ఖర్చు చేస్తోంది. ఇప్పుడు Ray-Ban Stories కళ్లజోళ్ల తయారీకి ఈ రాబడి ఆదాయాన్ని ఖర్చు చేస్తోంది.
iPhone 13 : ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 13 సిరీస్ రిలీజ్‌ డేట్ ఫిక్స్..

ట్రెండింగ్ వార్తలు