FASTag Annual Pass : వాహనదారులకు అలర్ట్.. ఆగస్టు 15 నుంచే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్.. ఫీజు, అర్హత, ఎలా అప్లయ్ చేయాలి?

FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్.. ఆగస్టు 15 నుంచే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అమల్లోకి రానుంది..

FASTag Annual Pass

FASTag Annual Pass : వాహనదారులకు బిగ్ అప్‌డేట్.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి రోజువారీ ప్రయాణికుల (FASTag Annual Pass) కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ స్కీమ్ ప్రకటించింది.

వార్షిక ప్లాన్ ప్రకారం.. జాతీయ రహదారి (NH), జాతీయ మోటార్‌వే (NE) ఫీజు ప్లాజాలలో ఏడాది లేదా 200 ట్రిప్పులకు ఫ్రీ పాస్ పొందవచ్చు. ఇందులో ఏది ముందుగా పూర్తి అయితే అది వర్తిస్తుంది. ఆగస్టు 15, 2025 నుంచి వార్షిక పాస్ అమల్లోకి రానుంది. ఈ వార్షిక పాస్ అందుబాటులోకి వచ్చాక టోల్ ప్లాజా వద్ద క్యూ ఉండదు. టోల్ టాక్సులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ గురించి పూర్తి వివరాలివే :

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఏంటి? :
రూ. 3వేలకు ఫాస్ట్ ట్యాగ్ రెన్యువల్ ద్వారా వ్యాలిడిటీ వ్యవధి ముగిసే వరకు వినియోగదారులు ఏదైనా జాతీయ రహదారి లేదా మోటార్‌వేను ఉపయోగించుకోవచ్చు. ఈ పాస్‌ల వ్యాలిడిటీ గడువు ముగిసినప్పుడు వినియోగదారులు ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ మాదిరిగానే రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఏ ఫీజు ప్లాజాలకు ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ వర్తిస్తుందంటే? :
ఈ వార్షిక పాస్ అనేది నేషనల్ హైవే (NH), నేషనల్ మోటార్‌వే (NE) ఫీజు ప్లాజాల వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్యాస్ట్ ట్యాగ్ మోటార్‌వేస్, రాష్ట్ర రహదారులు (SH), రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక అధికారులచే ఇతర ప్రదేశాలలోని ఫీజు ప్లాజాలలో అలాగే పార్కింగ్ ప్రాంతాలలో సాధారణ ఫాస్ట్ ట్యాగ్ మాదిరిగా పనిచేస్తుంది. సంబంధిత వినియోగదారు రుసుములు వర్తించవచ్చు.

Read Also : Rapido Food App : స్విగ్గీ, జొమాటోకు పోటీగా రాపిడో కొత్త ఫుడ్ డెలివరీ Ownly యాప్.. ఫస్ట్ సర్వీసు ఎక్కడంటే? ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ వ్యాలిడిటీ :
వార్షిక పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది లేదా 200 లావాదేవీల (ట్రిప్పులు)తో వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో ఏది ముందుగా అయితే అది వర్తిస్తుంది. వార్షిక పాస్ 200 ట్రావెల్స్ పూర్తి అయ్యాక యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది తర్వాత ఆటోమాటిక్‌గా సాధారణ ఫాస్ట్ ట్యాగ్‌‌కి మారిపోతుంది. ఆ తర్వాత వార్షిక పాస్ కోసం వినియోగదారులు తప్పనిసరిగా రీ యాక్టివేట్ చేయాలి. అప్పుడు ఏడాది వ్యాలిడిటీతో 200 ట్రావెల్ క్రెడిట్స్‌ పొందవచ్చు.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అర్హతలివే :
వాహన్ డేటాబేస్ ద్వారా ప్రైవేట్ వాణిజ్యేతర ఆటోమొబైల్స్, జీపులు, వ్యాన్లకు మాత్రమే వార్షిక పాస్ చెల్లుతుంది. ఏదైనా కమర్షియల్ వాహనంలో నోటీసు లేకుండా ఇన్‌స్టంట్ యాక్టివ్ అవుతుంది.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ తప్పనిసరి కాదా? :
వార్షిక పాస్ కేవలం ఆప్షనల్ మాత్రమే. ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ యథాతథంగా వర్క్ అవుతుంది. వార్షిక పాస్ లేని యూజర్లు ఫాస్ట్ ట్యాగ్ రుసుము రేట్లకు లోబడి, ఫీజు ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించవచ్చు.