FASTag KYC Update : మీ ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని ఇంకా అప్‌డేట్ చేయలేదా? ఈరోజే లాస్ట్ డేట్.. ఏయే డాక్యుమెంట్లు అవసరమంటే?

FASTag KYC Update : మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ పూర్తి చేశారా? ఎన్‌హెచ్ఏఐ ప్రకారం.. బ్యాంకులు జనవరి 31, 2024 తర్వాత కైవైసీ పూర్తి చేయని అన్ని ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేయడం లేదా బ్లాక్‌లిస్ట్ చేయనున్నాయి.

FASTag KYC Update Last Date Today_ Check Steps, Documents Needed For Your KYC

FASTag KYC Update : మీరు ఇంకా ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని పూర్తి చేయలేదా? మీరు తరచుగా హైవేలపై డ్రైవ్ చేస్తుంటే ఇది మీకోసమే.. ఇప్పుడే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. ఈరోజే (జనవరి 31) లాస్ట్ డేట్.. ఈ డేట్ దాటితే కేవైసీ చేయలేరు. దాంతో మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. రోజువారీ ప్రయాణ సమయంలో టోల్ గేట్‌లను దాటవలసి వస్తే జనవరి 31 గడువులోపు మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫాస్ట్‌ట్యాగ్ అంటే ఏమిటి? :
ఫాస్ట్‌ట్యాగ్ అనేది హైవేలపై టోల్‌లను వసూలు చేయడానికి ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్. కదిలే వాహనాలపై నిఘా ఉంచుతూ టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్నులను వసూలు చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ లేదా ప్రీపెయిడ్ కార్డ్‌కి కనెక్ట్ చేసిన కారు విండ్‌స్క్రీన్‌కు ట్యాగ్‌ని వర్తింపజేయడం (RFID) టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న కారు టోల్ బూత్‌కు చేరుకున్నప్పుడు, స్కానర్ ట్యాగ్‌ని స్కాన్ చేస్తుంది. లింక్ అయిన కార్డ్ లేదా అకౌంట్ నుంచి టోల్‌ను ఛార్జ్ చేస్తుంది.

Read Also : WhatsApp Passkey : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ పాస్‌కీ వచ్చేసింది.. ఇదేలా పనిచేస్తుందంటే?

ఫాస్ట్ ట్యాగ్ కోసం కేవైసీ అవసరమా? :
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేసింది. తగిన బ్యాలెన్స్ ఉన్న సందర్భాల్లో జనవరి 31, 2024 తర్వాత అసంపూర్తిగా ఉన్న మీ కేవైసీని నిలిపివేయొచ్చు. కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకుంటే.. బ్యాంకులు అన్ని ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేస్తాయి లేదా బ్లాక్‌లిస్ట్ చేస్తాయి. వాహనాలపై ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్‌ట్యాగ్‌లను ఫిక్సింగ్ చేయకపోవడం, ఒకే వాహనం కోసం మల్టీ ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేయడం, కేవైసీ ధృవీకరణ లేకుండా ఫాస్ట్‌ట్యాగ్‌ల పంపిణీని నియంత్రించడమే దీని ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు.

మీరు FASTagలో కేవైసీ ఎలా అప్‌డేట్ చేస్తారంటే?

  • అధికారిక బ్యాంక్-లింక్డ్ FASTag వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ఆపై మీ మొబైల్ నంబర్, ఫోన్‌లో వచ్చిన ఓటీపీ కీతో లాగిన్ చేయండి.
  • హోమ్‌పేజీలో, ‘మై ప్రొఫైల్’ సెక్షన్ కోసం సెర్చ్ చేసి కేవైసీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త విండో ఓపెన్ అవుతుంది. అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి, Submit బటన్‌ను క్లిక్ చేయండి.
  • మీ KYC ప్రక్రియ పూర్తవుతుంది. మీ అప్‌డేట్ చేసిన స్టేటస్‌పై డిస్‌ప్లే అవుతుంది.

ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ కోసం అవసరమైన డాక్యుమెంట్లు :
అవసరమైన డాక్యుమెంట్లలో వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, గుర్తింపు రుజువుగా ఓటరు ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ ఉన్నాయి. అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఉన్నాయి.

FASTag KYC Update Last Date Today 

ఫాస్ట్‌ట్యాగ్ స్టేటస్ : ఎలా చెక్ చేయాలంటే? :

  • మీరు ప్రత్యేక వెబ్‌సైట్ fastag.ihmcl.comలో కూడా చేయవచ్చు.
  • వెబ్‌సైట్ ఓపెన్ చేసి పేజీ కుడి ఎగువన ఉన్న లాగిన్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • OTPని ఉపయోగించి లాగిన్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • లాగిన్ అయిన తర్వాత డ్యాష్‌బోర్డ్‌లోని ‘మై ప్రొఫైల్’ సెక్షన్ ఎంచుకోండి.
  • మై ప్రొఫైల్ సెక్షన్.. FASTag KYC స్టేటస్, రిజిస్టర్ ప్రక్రియలో ఎంటర్ చేసిన ప్రొఫైల్ వివరాలను డిస్‌ప్లే చేస్తుంది.
  • మీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

Read Also : Valentine’s Day Gifts : వాలెంటైన్స్ డే గిఫ్ట్స్.. మీ ప్రియమైనవారి కోసం 5 అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌లివే..

ట్రెండింగ్ వార్తలు