×
Ad

Upcoming Phones 2026 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ ఫిబ్రవరిలో రాబోయే సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. వివో నుంచి ఐఫోన్ వరకు.. ఫుల్ లిస్ట్

Upcoming Phones 2026 : ఫిబ్రవరి 2026లో అనేక స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26 నుంచి మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వరకు ఫీచర్లు, ధరపై ఓసారి లుక్కేయండి..

Upcoming Phones 2026 ( Image Credit to Original Source)

  • ఫిబ్రవరిలో రాబోయే కొత్త స్మార్ట్ ఫోన్లు జాబితా ఇదిగో 
  • ఫ్లాగ్‌షిప్‌ నుంచి ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ల వరకు ప్రతి కేటగిరీలో కొత్త ఆప్షన్లు
  • శాంసంగ్ నుంచి మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వరకు అద్భుతమైన ఫోన్లు 

Upcoming Phones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫిబ్రవరి 2026లో భారత మార్కెట్లో అనేక మోడళ్ల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో అనేక బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి.

ముఖ్యంగా, ఫ్లాగ్‌షిప్‌ల నుంచి ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ల వరకు ప్రతి కేటగిరీలో కొత్త ఆప్షన్లు కనిపిస్తాయి. శాంసంగ్, ఆపిల్, వివో, ఐక్యూ, మోటోరోలా వంటి కంపెనీల నుంచి ఈ ఫిబ్రవరిలో కొత్త ఫోన్లు మార్కెట్లో విడుదల కానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్, ఐఫోన్ 17e, వివో V70, ఐక్యూ 15R, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వంటి ఫోన్‌లు ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే? ఇంతకీ ఏయే బ్రాండ్ల ఫోన్లు రానున్నాయో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

వివో V70, వివో V70 ఎలైట్ :
ఫిబ్రవరి మధ్య నాటికి కంపెనీ వి-సిరీస్‌ను లాంచ్ చేయనుంది. వివో V70, వివో V70 ఎలైట్‌ పేరుతో భారత మార్కెట్లోకి రానున్నాయి. ఈ వివో సిరీస్ డిజైన్, కెమెరా క్వాలిటీపైనే ఎక్కువగగా ఫోకస్ పెట్టింది. రాబోయే కొత్త మోడళ్లు కూడా ఇదే ఫార్మూలాను పాటిస్తాయని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఈ రెండు ఫోన్ల ధర రూ. 55వేల కన్నా తక్కువ ధరకే ఉండవచ్చు. ప్రీమియం మిడ్-రేంజ్ యూజర్లకు బెటర్ ఆప్షన్.

ఐక్యూ 15R :
ఫిబ్రవరి 24న భారత మార్కెట్లోకి ఐక్యూ 15R లాంచ్ కానుంది. ‘R’ బ్రాండింగ్‌తో ఐక్యూ నుంచి రాబోయే ఫస్ట్ ఫోన్ ఇదే.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్ మాదిరి పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గేమింగ్, ఫోన్ ఎక్కువగా వాడే యూజర్లకు అద్భుతమైన ఆప్షన్.

Read Also : Car Loans : మీకు కారు లోన్ కావాలా? ఈ 4 బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు.. ఏయే బ్యాంకులంటే?

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ :
మోటోరోలా కంపెనీ ఫిబ్రవరి మధ్యలో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ లాంచ్ చేయనుంది. నివేదికలు ప్రకారం.. 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్, భారీ 7,000mAh బ్యాటరీతో రావచ్చు. IP68, IP69 రేటింగ్‌ కూడా అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S26:
ఈ ఫిబ్రవరిలో అతిపెద్ద లాంచ్ శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కావచ్చు. ఇందులో గెలాక్సీ S26, S26+, S26 అల్ట్రాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈసారి రాబోయే ఫోన్లలో మెయిన్ డిజైన్ మార్పులు ఉండకపోవచ్చు. అందుకు బదులుగా శాంసంగ్ అద్భుతమైన కెమెరాలు, పవర్ ఫుల్ ప్రాసెసర్లు, డిస్‌ప్లే అప్ గ్రేడ్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2026 ఈవెంట్ ఫిబ్రవరి 25న జరిగే అవకాశం ఉంది.

ఐఫోన్ 17e :
ఆపిల్ కూడా ఐఫోన్ 17e ఫిబ్రవరి చివరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 16e మాదిరిగానే కొంచెం చౌకైన ఐఫోన్. A19 చిప్, ఫేస్ ఐడీతో వస్తుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ 17e ధర రూ. 64,999 కన్నా తక్కువగా ఉండవచ్చు.