Fire-Boltt Emerald Smartwatch : ఫైర్-బోల్ట్ ఎమరాల్డ్ స్మార్ట్‌వాచ్ కంపెనీ ‘జ్యువెల్స్ ఆఫ్ టైమ్’ సిరీస్‌తో సరికొత్తగా లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ డైమండ్-కట్ గ్లాస్ డయల్ రత్న ఫ్రేమ్ రొటోటెడ్ క్రౌన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 240×240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.09-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. హృదయ స్పందన రేటు, స్లీప్, SpO2 స్థాయి మానిటరింగ్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ఈ కొత్త ఫైర్-బోల్ట్ ఎమరాల్డ్ మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేసేందుకు సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.
భారత్‌లో ఫైర్-బోల్ట్ ఎమరాల్డ్ ధర :
ఫైర్-బోల్ట్ ఎమరాల్డ్ స్మార్ట్ వాచ్ ధర భారత మార్కెట్లో రూ. 5,999 ఉండగా, స్మార్ట్ వాచ్ ఫైర్-బోల్ట్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ గ్రీన్, బ్లూ, రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో లభించే మెటాలిక్ స్ట్రాప్‌తో విక్రయిస్తోంది. బాక్స్‌లో అదనపు స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రాప్‌తో పాటు వస్తుంది.
ఫైర్-బోల్ట్ ఎమరాల్డ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు :
కొత్త ఫైర్-బోల్ట్ ఎమరాల్డ్ స్మార్ట్‌వాచ్ 1.09-అంగుళాల (240×240 పిక్సెల్స్) HD డిస్‌ప్లేతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి లింక్ చేసి ఉన్నంత వరకు యూజర్లు వాచ్ స్క్రీన్ నుంచి నేరుగా ఫోన్ కాల్‌లు చేసేందుకు అనుమతిస్తుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్, స్పీకర్‌తో కూడా వస్తుంది. లేటెస్ట్ స్మార్ట్ వాచ్ (Fire-Boltt) బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ (SpO2) మానిటరింగ్, హృదయ స్పందన పర్యవేక్షణ, స్త్రీ ఆరోగ్య ట్రాకర్, స్లీప్ ట్రాకింగ్‌తో సహా స్మార్ట్ హెల్త్ సెన్సార్‌లకు సపోర్టును అందిస్తుంది.
అదనంగా, ఫైర్-బోల్ట్ ఎమరాల్డ్ మల్టీ స్పోర్ట్స్ మోడ్‌ల ట్రాకింగ్‌తో కూడా వస్తుంది. స్మార్ట్ వాచ్ ఎంచుకోవడానికి అనేక కస్టమైజ్ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. ఫైర్-బోల్ట్ ఎమరాల్డ్ 5 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుందని పేర్కొన్నారు. ఇంకా, భారతీయ బ్రాండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఆఫర్ కూడా కనెక్ట్ చేసిన స్మార్ట్‌ఫోన్ నుంచి కాల్స్, మెసేజ్‌ల వంటి నోటిఫికేషన్‌లను యూజర్లకు అనుమతిస్తుంది. రిమోట్ కెమెరా కంట్రోల్స్, వాతావరణం, అలారం సపోర్టు కోసం వాచ్ ఇతర ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. నీటి నిరోధకత కోసం IP68-రేటెడ్ కూడా అందిస్తుంది.