Fire Boltt Smartwatches : భారత్‌లో రూ. 3వేల లోపు ధరకే మూడు కొత్త ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Fire Boltt Smartwatches : భారత మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన Fire-Boltt కంపెనీ మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేసింది. Saturn, Talk 3, and Ninja-Fit అనే స్మార్ట్‌వాచ్‌లు ఆఫ్‌లైన్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
- Sreehari A
- Published On : January 27, 2023 / 07:37 PM IST
Fire Boltt launches 3 new smartwatches in India, all priced under Rs 3000
Fire Boltt Smartwatches : భారత మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన Fire-Boltt కంపెనీ మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేసింది. Saturn, Talk 3, and Ninja-Fit అనే స్మార్ట్‌వాచ్‌లు ఆఫ్‌లైన్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌ల లేటెస్ట్ రేంజ్ అందరి యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లు సరసమైన ధరతో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో స్మార్ట్‌వాచ్‌ల ధర వరుసగా రూ. 3999, రూ. 2199 రూ. 1299గా ఉన్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్లలో క్రోమా (Croma), రిలయన్స్, విజయ్ సేల్స్ (Vijay Sales)తో సహా 750+ కన్నా ఎక్కువ నగరాల్లో మోడ్రాన్ ట్రేడ్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.
ఫైర్-బోల్ట్ సాటర్న్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. స్క్వేర్ డయల్, 368×448 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంటర్నల్ మైక్, స్పీకర్ కాలింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. స్పీడ్ యాక్సెస్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ, సింక్ కాంటాక్ట్‌లను సులభంగా ఉపయోగించవచ్చు. అదనంగా, వాచ్‌లో 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, అప్‌గ్రేడ్ హెల్త్ సూట్, అలాగే గేమ్‌లు, కాలిక్యులేటర్ ఉన్నాయి. IP 67 వాటర్-రెసిస్టెంట్ కూడా పొందవచ్చు. వాటర్, స్పెట్ స్ప్లాష్‌లకు అనుకూలంగా ఉంటుంది. స్మార్ట్‌వాచ్ బ్లాక్, బ్లూ, పింక్, గ్రే, సిల్వర్, గోల్డ్ బ్లాక్ వంటి 5 అద్భుతమైన కలర్లలో అన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.
Fire Boltt launches 3 new smartwatches in India
Fire-Boltt Talk 3 అనేది బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌వాచ్. BT కాలింగ్‌ని కూడా కలిగి ఉంది. యూజర్లు తమ ప్రయాణంలో కాల్‌లు చేసేందుకు స్వీకరించడానికి అనుమతిస్తుంది. 1.28” HD ఫుల్ టచ్ డిస్‌ప్లే, షార్ప్ ఇమేజ్‌ల కోసం 240*240 పిక్సెల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ తేలికైనది. లోహపు ఆకృతిని కలిగి ఉంది. రౌండ్ డయల్‌లో సెట్ అయింది. వేరబుల్ సరిపోయేలా మార్చగలిగే మల్టీ వాచ్ ఫేస్‌లను కూడా కలిగి ఉంది. 123 స్పోర్ట్స్ మోడ్, క్రీడా ప్రేమికులకు, ఫిట్‌నెస్ ఔత్సాహికులకు సరైనది. వాచ్ IP 67 వాటర్ రెసిస్టెంట్, ఫిట్‌నెస్‌పై స్వెట్, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. వాచ్ బ్లాక్, బ్లూ, గ్రీన్, సిల్వర్, పింక్ వంటి అందమైన కలర్లలో అందుబాటులో ఉంది. అన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.
ఫైర్-బోల్ట్ నింజా-ఫిట్ ఫిట్‌నెస్ 123 స్పోర్ట్స్ మోడ్‌లతో వచ్చింది. ప్రయాణంలో మీ ఫిట్‌నెస్ ట్రాక్ చేయవచ్చు. స్మార్ట్‌వాచ్ 1.69″ భారీ స్క్వేర్ డయల్, ఫుల్ టచ్ HD డిస్ప్లేతో వస్తుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. మీరు ఇకపై వాచ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ మానసిక స్థితి, దుస్తులకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. మల్టీ వాచ్ ఫేస్‌లను కూడా కలిగి ఉంది. బ్లాక్, బ్లూ, సిల్వర్, పింక్, బ్లూ, రెడ్, గ్రీన్ వంటి అద్భుతమైన కలర్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ జనవరి 29 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మూడు స్మార్ట్‌వాచ్‌లు స్మార్ట్ నోటిఫికేషన్‌లు, వాతావరణ అప్‌డేట్స్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ వంటి అద్భుతమైన ఫీచర్‌లతో వస్తాయి.
SpO2 మానిటర్, హార్ట్ రేట్ ట్రాకర్, స్లీప్ మానిటర్‌తో కూడిన అప్‌గ్రేడ్ హెల్త్ సూట్‌తో కూడా వస్తాయి. ఫైర్-బోల్ట్ సహ వ్యవస్థాపకుల ప్రకారం.. ఆఫ్‌లైన్/ప్రాంతీయ కస్టమర్ల అవసరాలకు తగినట్టుగా సరసమైన ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు స్మార్ట్‌వాచ్‌లను ఆఫ్‌లైన్ మార్కెట్‌లో ప్రత్యేకంగా లాంచ్ చేసింది. BT కాలింగ్, అప్‌గ్రేడ్ హెల్త్ సూట్, ట్రాక్ చేసేందుకు అనేక స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఆసక్తి గల వినియోగదారులు సరసమైన ధరలకే ఈ మూడు స్మార్ట్ వాచ్‌లను సొంతం చేసుకోవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
