Exclusive First Look At Lava’s Upcoming Phone With Price Under Rs 10,000
Lava Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లావా నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లోకి త్వరలో ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి రాబోయే లావా స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెషల్ ఫోటోలను రిలీజ్ చేసింది. Lava ఫోన్ వెనుక పెద్ద డ్యూయల్ సెన్సార్‌లు కర్వ్ తిరిగి ఉన్నాయి. లావా స్మార్ట్‌ఫోన్ కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను అందిస్తుందని అంచనా. డేటా ప్రకారం.. ఫోన్ బడ్జెట్-సెంట్రిక్ సెగ్మెంట్‌తో రానుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10వేల లోపు ఉంటుంది. Lava ఫోన్ Realme C సిరీస్, Poco C సిరీస్, Redmi వంటి సిరీస్‌లను సూచిస్తుంది. రూ.10వేల లోపు ఆల్ రౌండర్ ఫోన్‌గా చెప్పవచ్చు. బడ్జెట్-సెంట్రిక్ లావా ఫోన్ గ్లాస్ బ్యాక్‌ను అందించనుంది.
Exclusive First Look At Lava’s Upcoming Phone With Price Under Rs 10,000
రూ.10వేల ధరలో గ్లాస్ వెనుక ప్యానెల్‌తో ఎలాంటి ఫోన్‌లు లేవు. స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఈ కొత్త బడ్జెట్ లావా స్మార్ట్ ఫోన్ వెల్లడించలేదు. ఈ నెలలోనే ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. జూన్ లాంచ్ ఆసన్నమైనప్పటికీ, నిర్దిష్ట లాంచ్ టైమ్‌లైన్ కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
స్పెసిఫికేషన్ల పరంగా కూడా, రాబోయే లావా ఫోన్ గురించి ఇంకా పెద్దగా తెలియదు. లావా కంపెనీ తమ బ్రాండ్ నుంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి చాలా కాలం అయ్యింది. చివరిది Lava Agni 5G. ఈ ఫోన్ 6.78-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్‌సెట్, క్వాడ్-కెమెరా రియర్ సెటప్, 5000mAh బ్యాటరీలతో వచ్చింది.
Read Also : 5G Smartphones : భారత్‌కు 5G నెట్‌వర్క్ వస్తోంది.. ఇంతకీ 5G స్మార్ట్ ఫోన్లు కొనాలా? వద్దా?