×
Ad

Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 9పై బిగ్ డిస్కౌంట్లు.. పిక్సెల్ ఫ్యాన్స్ ఇప్పుడే కొనేసుకోండి!

Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ 9లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రెండు ఫోన్లపై ధర ఎంత తగ్గిందంటే?

Flipkart Big Billion Days 2025

Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైంది. కొత్త ఫోన్ కొనాలని అనుకునేవారికి అద్భుతమైన ఆఫర్లు.. ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ అనేక స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. మీరు పిక్సెల్ అభిమాని అయితే ఈ ఆఫర్ మీకోసమే..

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ 9 బేస్ వేరియంట్ భారీ (Flipkart Big Billion Days 2025) డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 9పై భారీ తగ్గింపు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ 16GB ర్యామ్ వేరియంట్ అసలు లాంచ్ ధర రూ.1,72,999 నుంచి రూ.1,09,999కు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అన్ని బ్యాంక్ ఆఫర్లతో సహా ధర తగ్గింపు పొందవచ్చు. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అనేది గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది.

ఈ పిక్సెల్ ఫోన్ 48MP ప్రైమరీ షూటర్, 10.MP టెలిఫోటో షూటర్, 10.5MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 10MP కవర్ సెన్సార్, 10MP ఫ్రంట్ సెన్సార్‌ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 21W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4650mAh బ్యాటరీ కలిగి ఉంది.

Read Also : Oppo Reno 13 Price Drop : ఇది కదా ఆఫర్ అంటే.. రూ. 38వేల ఒప్పో రెనో 13 ఫోన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే? ఈ డీల్ మిస్ కావొద్దు..!

పిక్సెల్ 9 విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.34,999 ధరకు లభిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్‌ అసలు లాంచ్ ధర రూ.79,999గా ఉంది. గూగుల్ పిక్సెల్ 9 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 12GB ర్యామ్, గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP ప్రైమరీ షూటర్, 48MP సెకండరీ షూటర్‌, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం పిక్సెల్ 9 ఫోన్ 10.5MP ఫ్రంట్ స్నాపర్‌ కూడా కలిగి ఉంది. 4700mAh బ్యాటరీతో పాటు 27W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.