Best iPhone Deals
Best iPhone Deals : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో అనేక పాత, కొత్త ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 23న ఈ సేల్ ప్రారంభమవుతుంది.
మీరు కూడా ఆపిల్ ఐఫోన్ ఏదైనా కొనేందుకు (Best iPhone Deals) చూస్తుంటే ఇది మీకోసమే.. ఐఫోన్ తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనేస్తుంటారు. చాలామంది పాత ఐఫోన్లపై పెద్దగా ఆసక్తి చూపరు. కానీ, కొన్ని పాత ఐఫోన్‌లు అద్భుతమైన డిస్కౌంట్‌లతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
2025లో ఏదైనా కొత్త ఐఫోన్ కొనే ముందు ఓసారి ఆలోచించండి. ఈ ఏడాదిలో కొన్ని ఐఫోన్ మోడల్స్ తక్కువ ధరకే లభ్యమవుతున్నా కొనకపోవడమే మంచిది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు ముందు ఆపిల్ పాత, కొత్త ఐఫోన్లలో ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్, ఐఫోన్ 16 వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఐఫోన్లను మాత్రం కొనకపోవడమే బెటర్.. అవేంటి? ఏయే ఐఫోన్లను కొనుగోలు చేయొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐఫోన్ 15 :
ఈ ఆపిల్ ఐఫోన్ 15 ఇప్పటికీ బెస్ట్ ఐఫోన్. ఐఫోన్ 15 పాత A16 చిప్‌తో పవర్ అందిస్తుంది. కొత్త ఐఫోన్లలో స్టాండర్డ్ అయిన ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇందులో లేవు. చిన్న బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఐఫోన్ స్కిప్ చేయడమే బెటర్.
ఐఫోన్ 14 :
2025లో ఐఫోన్ 14 కొనడం కూడా కష్టమే. ఇప్పటికీ లైట్నింగ్ కనెక్టర్‌ను కలిగి ఉంది. ఇప్పుడు ప్రతి ఐఫోన్ USB-C కనెక్టర్ తో వస్తుంది. పిక్సెల్ 9 వంటి పోటీదారులతో పోలిస్తే డేటెడ్ నాచ్‌తో కూడిన 60Hz డిస్‌ప్లే పాతదిగా కనిపిస్తుంది. కెమెరా సెటప్ కూడా చాలా పాతదిగా అనిపిస్తుంది.
ఐఫోన్ 13 :
ఆపిల్ ఐఫోన్ 14 పాతది అయినా ఐఫోన్ 13 ఇంకా పాతది. అదే లైట్నింగ్ కనెక్టర్, పాత కెమెరాలు, 60Hz డిస్‌ప్లేతో వస్తుంది. అదే ధరతో రూ. 30వేలు నుంచి రూ. 35వేల ధరలో పొందవచ్చు. 2025లో ఈ ఐఫోన్ 13 కొనుగోలు చేయడం కష్టమే. ఎందుకంటే చాలా పాత ఐఫోన్ కావడమే.. ఈ ఒక్క ఐఫోన్ 13 కొనకపోవడమే బెటర్.
కొనాల్సిన ఐఫోన్లు ఇవే :
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ :
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,999 ధరలో ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రీమియం టైటానియం బిల్డ్, అద్భుతమైన కెమెరాలు, ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా మెరిసే 120Hz డిస్ప్లేతో వస్తుంది. మరింత స్టోరేజీ, మెరుగైన బ్యాటరీ కూడా పొందవచ్చు. రూ.89,999 ధరకు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256GB బేస్ స్టోరేజ్, భారీ డిస్‌ప్లే అందిస్తుంది.
ఐఫోన్ 16 :
బ్యాంక్ ఆఫర్లతో రూ. 52వేల కన్నా తక్కువ ధరతో ఐఫోన్ 16 కొనుగోలు చేయొచ్చు. ఈ మోడల్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుంది. అతి తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలనేవారికి ఇదే బెస్ట్ ఆప్షన్.