Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ నవంబర్ 11కు అందుబాటులో ఉంటుంది. సాధారణ డిస్కౌంట్‌లతో పాటు, ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ సేల్ సమయంలో SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

Flipkart Big Diwali Sale _ These Smartphones Get Price Cuts

Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ మరికొన్ని రోజుల పాటు అనేక రకాల ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందించనుంది. ఈ 10 రోజుల సేల్ నవంబర్ 2న ప్రారంభమై నవంబర్ 11న ముగియనుంది. సాధారణ డిస్కౌంట్‌లతో పాటు, ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ సేల్ సమయంలో SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్  అందిస్తోంది.

ఇంకా, పేటీఎం ఆధారిత ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, అలాగే నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయి. శాంసంగ్, ఒప్పో, రియల్‌మితో సహా పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో తమ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు, డీల్‌లను అందిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో హ్యాండ్‌పిక్డ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్‌లను మీకోసం అందిస్తున్నాం.

మోటరోలా ఎడ్జ్ 40 :
మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,999 నుంచి రూ. 26,999, ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ. రూ. 1,500 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు రూ. 23,799 పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 40 మీడియాటెక్ డైమెన్సిటీ 8020 SoCపై రన్ అవుతుంది. 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 68W వైర్డ్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

Read Also : Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ సేల్.. రూ.20వేల లోపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డీల్స్..!

ఒప్పో రెనో 10 5జీ :
ఒప్పో రెనో 10 5జీ ఫోన్ సేల్ సమయంలో అసలు ధర రూ. 32,999 నుంచి రూ. 32,249 (బ్యాంక్ ఆఫర్‌లతో సహా) వరకు ఉంది. ఈ ఫోన్‌పై రూ. 25,799 ఎక్స్చేంజ్ తగ్గింపు కూడా పొందవచ్చు. ఒప్పో రెనో 10 5జీ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,412 పిక్సెల్‌లు), OLED 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో ఆక్టా-కోర్ 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ద్వారా అందిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 7ఎ :
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 7ఎ ఫోన్ సింగిల్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999కి అందిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లతో ధరను రూ. 32,499కు తగ్గిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో ధర రూ. 43,999కు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 31,299 ఎక్స్చేంజ్ తగ్గింపు పొందవచ్చు. పిక్సెల్ 7ఎ టెన్సర్ G2 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్-HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డ్యూయల్ బ్యాక్ కెమెరాలతో అందిస్తుంది.

Flipkart Big Diwali Sale 

రియల్ 11 ప్రో 5జీ :
రియల్‌మి 11ప్రో 5జీ రూ.21,999కి లిస్టు అయింది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అసలు ధర రూ. 25,999కు అందిస్తోంది. ఆసక్తి ఉన్న యూజర్లలో రూ. 18,799 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లకు రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. రియల్‌మి 11 ప్రో 5జీ ఫోన్ 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ 6ఎన్ఎమ్ మీడియా టెక్ డైమెన్సిటీ 7050 SoC ద్వారా పవర్ అందిస్తుంది.

పోకో F5 5జీ :
భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో పోకో F5 ప్రారంభ ధర రూ. 23,999కు అందిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. దుకాణదారులు మొత్తం ఖర్చును మరింత తగ్గించుకోవచ్చు. పోకో F5 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 67W టర్బోచార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 64ఎంపీ ప్రైమరీ సెన్సార్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 12 ప్రో 5జీ :
2023 ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో రెడ్‌మి Note 12 Pro 5G తగ్గింపు ధర రూ. 20,999. ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 14,799కు సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మి నోట్ 12 ప్రో 5జీలో 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1080 SoC ద్వారా ఆధారితమైనది. 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ F34 :
శాంసంగ్ గెలాక్సీ F34 ఫోన్ మోడల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.16,499లకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి పండుగ సేల్‌లో SBI కార్డ్ హోల్డర్లు రూ. 1,500 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, ఆసక్తిగల దుకాణదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు రూ. 13,299 అదనపు తగ్గింపు పొందవచ్చు. గెలాక్సీ F34 పెద్ద 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఆక్టా-కోర్ ఎక్సోనస్ 1280 SoCని కలిగి ఉంది.

Read Also : Amazon Festival Sale 2023 : అమెజాన్‌ ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి