Flipkart Big Saving Day Sale goes live _ Apple AirPods Pro available at Rs 590 with over Rs 15000 off
Flipkart Big Saving Day Sale : కొత్త ఎయిర్‌పాడ్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్ కన్నా ముందుగానే ప్లస్ మెంబర్ల కోసం సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ సందర్భంగా (Apple AirPods), ఆపిల్ ఐఫోన్లతో సహా ఆపిల్ ప్రొడక్టులు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈవెంట్ జూలై 14 నుంచి జూలై 19 వరకు కొనసాగుతుంది.
ఈ ప్లాట్‌ఫారంపై స్మార్ట్ఫోన్లు, ఇయర్‌బడ్‌లు, టీవీలు, ఏసీలు ఇతరులతో సహా వివిధ కేటగిరీ ప్రొడక్టులపై ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తుంది. మీరు (Apple AirPods Pro)ని కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది సరైన సమయం. కేవలం రూ. 590 ధరకే ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 25,710 తగ్గింపు పొందింది. దాంతో ప్రస్తుతం కేవలం రూ. 590కే ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో అందుబాటులో ఉంది.
ఆపిల్ (AirPods Pro) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,310 తగ్గింపు తర్వాత రూ.15,990గా ఉంది. ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా ఫ్లిప్‌కార్ట్ మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. కేవలం స్మార్ట్ఫోన్లపైనే కాకుండా చాలా ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై కూడా అదిరే డిస్కౌంట్లను అందిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఫ్లిప్‌కార్ట్ మీకు అదనంగా రూ. 15,400 తగ్గింపును అందిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ AirPods Pro డివైజ్‌ని కేవలం రూ. 590కే ఆఫర్ అందిస్తోంది.
Flipkart Big Saving Day Sale goes live _ Apple AirPods Pro available at Rs 590 with over Rs 15000 off
ఆపిల్ AirPods Pro అనేది Apple పోర్ట్‌ఫోలియోలో అత్యంత అధునాతన ఇయర్‌బడ్‌లుగా చెప్పవచ్చు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ‘ప్రో’ వెర్షన్.. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన TWS ఇయర్‌బడ్‌లు. లాంచ్ సమయంలో Magsafe ఛార్జింగ్ కేస్‌తో కూడిన ఆపిల్ AirPods ప్రో ధర రూ.26,300గా ఉంది. చిన్న ఎయిర్‌పాడ్స్ ప్రో ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఆపిల్ AirPods Pro అనేది మార్కెట్లో లభించే అత్యంత విశ్వసనీయమైన ఇయర్‌బడ్‌లలో ఒకటిగా ఉంది.
అందుకే ఎక్కువగా సెలబ్రిటీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆపిల్ AirPods ప్రో చిన్న స్టీమ్ కలిగి ఉంటుంది. చెమట, నీటికి నిరోధకత కలిగిన సిలికాన్ టిప్స్‌తో వస్తుంది. ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్‌ను పొందవచ్చు. గత ఏడాదిలో కంపెనీ అధునాతన ప్రాసెసింగ్, ఫీచర్లతో ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో కొత్త వెర్షన్‌ను లాంచ్ అయింది. కానీ, ఫస్ట్ 1వ జనరేషన్ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇప్పటికీ స్మార్ట్ కొనుగోలు చేయొచ్చు.