Flipkart Diwali 2023 Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి 2023 సేల్.. ఇంకా ఒక్క రోజు మాత్రమే.. ఈ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్.. డోంట్ మిస్!

Flipkart Diwali 2023 Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి 2023 సేల్ నవంబర్ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు ఐఫోన్ 14, ఐఫోన్ 13, పిక్సెల్ 7 సిరీస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను పొందవచ్చు.

Flipkart Diwali 2023 sale ends tomorrow _ Best deals on iPhone 14, Pixel 7, and more

Flipkart Diwali 2023 Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ఇంకా ఒక్కరోజు మాత్రమే కొనసాగనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ తగ్గింపులను పొందవచ్చు. ఈ సేల్ నవంబర్ 2న ప్రారంభమై నవంబర్ 11న ముగియనుంది. రెగ్యులర్ డిస్కౌంట్‌లతో పాటు, సేల్ సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. పేటీఎం ఆధారిత ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో మీరు పొందగలిగే కొన్ని బెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ డీల్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 14 :
ఐఫోన్ 14 ఫోన్ 2532 x 1170 పిక్సెల్‌ల రిజల్యూషన్, 60హెచ్ఎడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు 12ఎంపీ డ్యూయల్ కెమెరా సిస్టమ్, 12ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఆపిల్ ఎ15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్ కలిగి ఉంది. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 3279ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఐఓఎస్ 16.xతో పనిచేస్తుంది. 5-కోర్ సీపీయూని కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. కానీ, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కాదని గమనించాలి. మీరు ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్‌ను బ్యాన్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, మరిన్నింటితో అతి తక్కువ తగ్గింపు ధర రూ. 33,999కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Best Phones in India : ఈ నవంబర్‌లో రూ.50వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ఐఫోన్ 13 :
ఆపిల్ ఐఫోన్ 13 2532 x 1170 పిక్సెల్‌ల రిజల్యూషన్, 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు 12ఎంపీ డ్యూయల్ కెమెరా సిస్టమ్, 12ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఆపిల్ ఎ15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్ కలిగి ఉంది. 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1TB స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 3227ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఐఓఎస్ 16.xతో పనిచేస్తుంది. 5-కోర్ సీపీయూని కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కానీ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ అందించడం లేదు. 128జీబీ స్టోరేజ్‌తో ఐఫోన్ 13 గణనీయంగా తగ్గి రూ. 28,249కి అందుబాటులో ఉంది. ఇందులో ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ డీల్‌లు, అదనపు డిస్కౌంట్‌లు ఉన్నాయి.

Flipkart Diwali 2023 sale ends tomorrow

పిక్సెల్ 7 :
గూగుల్ పిక్సెల్ 7 మోడల్ 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90హెచ్‌జెడ్ ఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు 50ఎంపీ డ్యూయల్ కెమెరా సిస్టమ్, 10.8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. గూగుల్ టెన్సర్ జీ2 చిప్‌తో ఆధారితమైనది. 8జీబీ ర్యామ్ కలిగి ఉంది. 128జీబీ స్టోరేజీ ఆప్షన్‌లో వస్తుంది. 4355ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. ఐఫోన్ 13, గూగుల్ పిక్సెల్ 7 మోడల్ 128జీబీ వేరియంట్ ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ డీల్‌లు, అదనపు తగ్గింపులతో సహా తక్కువ ధర రూ. 17,749 వద్ద అందుబాటులో ఉంది.

పిక్సెల్ 7ఎ :
గూగుల్ పిక్సెల్ 7ఎ ఫోన్ అనేది ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ప్రాసెసర్, కెమెరా సిస్టమ్‌తో కూడిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల పూర్తి-హెచ్‌డీ ప్లస్, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, గూగుల్ టెన్సర్ జీ2 చిప్, 8జీబీ ర్యామ్, 128జీబీ నాన్-ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ని కలిగి ఉంది. పిక్సెల్ 7ఎ ఫోన్ 64ఎంపీ ప్రధాన సెన్సార్, 13ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్‌తో పాటు 13ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.

ఇతర ముఖ్యమైన ఫీచర్లలో 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, (NFC), స్టీరియో స్పీకర్లకు సపోర్టుతో 4385ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 7ఎ మోడల్ 128జీబీ వెర్షన్ ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లు, అదనపు డిస్కౌంట్‌లతో కలిపి రూ. 10,249 కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

Read Also : Amazon Diwali Sale End : అమెజాన్ దీపావళి సేల్.. రూ.20వేల లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్ మీకోసం..!