Flipkart Diwali Offer
Flipkart Diwali Offer : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకే వివో V29 ప్రో 5G ఫోన్ లభ్యమవుతోంది. దీపావళి సందర్భంగా బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. మీరు వివో V29 ప్రో 5G ఫోన్‌పై రూ.11వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ వివో ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు (Flipkart Diwali Offer) ఇస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 8200 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. కర్వడ్ స్క్రీన్, కెమెరా సెటప్ కలిగి ఉంది. 60fps వద్ద 4K రిజల్యూషన్ వరకు రికార్డ్ చేయొచ్చు. వివో V29 ప్రో 5G ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వివో V29 ప్రో 5Gపై బిగ్ డిస్కౌంట్ :
భారత మార్కెట్లో వివో V29 ప్రో 5G ఫోన్ రూ. 47,999 ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో 22శాతం తగ్గింపుతో ఈ ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. కేవలం రూ.36,999 మాత్రమే చెల్లించాలి. రూ. 11వేలు సేవ్ చేసుకోవచ్చు. ఈ వివో ఫోన్ ఈఎంఐ ఆప్షన్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా కేవలం రూ. 1,301 చెల్లించాల్సి ఉంటుంది.
డిస్‌ప్లే :
పర్ఫార్మెన్స్ పరంగా వివో V29 ప్రో 5G ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8200 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ వంటి డిమాండ్ టాస్కులతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8GB, 12GB ర్యామ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. యూఎఫ్ఎస్ 3.1 టెక్నాలజీతో 256GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. అయితే, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీకి సపోర్టు ఇవ్వదు.
Read Also : Vivo T4 Lite 5G : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఈ వివో 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే? డోంట్ మిస్!
వివో V29 ప్రో 5G ఫోన్ 4600mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సాధారణ వినియోగంతో రోజంతా పవర్ అందిస్తుంది. ఈ ఫోన్‌ను 80W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో త్వరగా ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 18 నిమిషాల్లో ఒక శాతం నుంచి 50శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.
బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ సోనీ లెన్స్, 2x ఆప్టికల్ జూమ్‌తో 12MP ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ పొందుతారు. అయితే, ఫ్రంట్ సైడ్ ఆటోఫోకస్‌తో 50MP సెల్ఫీ కెమెరా, గ్రూప్ సెల్ఫీల కోసం వైడ్-యాంగిల్ లెన్స్ పొందవచ్చు.
డిజైన్, డిస్‌ప్లే :
వివో V29 ప్రో 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1260 x 2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల కర్వడ్ అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. HDR10+ సపోర్ట్, 1300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్, బ్యాక్ గ్లాస్‌తో కూడిన స్లిమ్ 7.46mm బాడీని కలిగి ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ కలిగి ఉంది. కానీ, వాటర్‌ప్రూఫ్ ఫోన్ కాదు.