Flipkart GOAT Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? 32 అంగుళాల స్మార్ట్‌టీవీలపై బిగ్ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి చౌకైన ధరకే..!

Flipkart GOAT Sale : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో రూ.5,999 కన్నా తక్కువ ధరకే QLED స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు. 32 అంగుళాల స్మార్ట్‌టీవీలను సరసమైన ధరకే ఎలా పొందాలంటే?

Flipkart GOAT Sale

Flipkart GOAT Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే, ఈ ఆఫర్లు మీకోసమే.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ (Flipkart GOAT Sale) సందర్భంగా పలు బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు కొత్త స్మార్ట్‌టీవీ కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

మీరు ఏదైనా స్మార్ట్ టీవీని డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ద్వారా సరసమైన ధరకే చాలా బ్రాండెడ్ టీవీలు అమ్మకానికి ఉన్నాయి. ఈ లిస్టులో QLED టీవీ కూడా లభ్యమవుతుంది. ధర రూ. 5,999 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ అద్భుతమైన టాప్ డీల్స్ ఓసారి వివరంగా తెలుసుకుందాం..

ఆల్ఫా QLED థామ్సన్ (24 అంగుళాలు) :
ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌టీవీని రూ.5,999కి అందిస్తుంది. బ్యాంక్, ఇతర డీల్స్ ద్వారా ధర ఇంకా తగ్గుతుంది. ఈ టీవీలోని QLED డిస్‌ప్లే ప్యానెల్ 24 అంగుళాలు ఉంటుంది. లైనెక్స్ TV OS ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. 24W సౌండ్ అవుట్‌పుట్‌ అందిస్తుంది. అనేక కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. OTT యాప్స్‌కు సపోర్టు చేస్తుంది.

Read Also : 5 Best Laptop Deals : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్‌లో రూ. 40వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్.. ఇప్పుడే కొనడం బెటర్..! 

రియల్‌మి టెక్‌లైఫ్ సినీసోనిక్ (32 అంగుళాలు) :
ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ టీవీని రూ.8,999కి విక్రయిస్తోంది. బ్యాంక్, ఇతర డీల్స్ ద్వారా ధరను మరింత తగ్గించవచ్చు. ఈ టీవీలోని QLED డిస్‌ప్లే ప్యానెల్ 32 అంగుళాలు ఉంటుంది. గూగుల్ టీవీ OS ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టు చేస్తుంది. 20W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. అనేక కనెక్టివిటీ ఆప్షన్లను కూడా అందిస్తుంది. OTT యాప్‌లకు కూడా సపోర్టు చేస్తుంది.

ఫాక్స్‌కీ 80 సెం.మీ (32 అంగుళాలు) :
ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ టీవీని రూ.7,499కి అందిస్తోంది. బ్యాంక్, ఇతర డీల్స్ ద్వారా తగ్గింపు ధరను పొందవచ్చు. ఈ టీవీలోని QLED డిస్‌ప్లే ప్యానెల్ 32 అంగుళాలు ఉంటుంది. గూగుల్ టీవీ OS ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టు చేస్తుంది. 30W సౌండ్ క్వాలిటీ కలిగి ఉంది. అనేక కనెక్టివిటీ ఆప్షన్లను కూడా అందిస్తుంది. OTT యాప్‌లకు కూడా సపోర్టు చేస్తుంది.

మోటోరోలా (32-అంగుళాలు) :
ఈ డీల్‌ ద్వారా స్మార్ట్‌టీవీ ధరను తగ్గించవచ్చు. ఈ టీవీలోని QLED డిస్‌ప్లే ప్యానెల్ 32 అంగుళాలు ఉంటుంది. గూగుల్ టీవీ OS సపోర్టు చేస్తుంది. 20W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. అలాగే, అనేక ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. OTT యాప్‌లకు కూడా సపోర్టు అందిస్తుంది.