5 Best Laptop Deals : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్‌లో రూ. 40వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్.. ఇప్పుడే కొనడం బెటర్..!
5 Best Laptop Deals : అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 సందర్భంగా 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ ఉన్నాయి. రూ. 40వేల లోపు ధరలో ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

5 Best Laptop Deals
5 Best Laptop Deals : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 సందర్భంగా అనేక బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ముఖ్యంగా రూ. 40వేల లోపు ధరలో కొన్ని బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
మీరు స్టూడెంట్ అయినా, ప్రొఫెషనల్ అయినా లేదా సాధారణ యూజర్ అయినా ఈ టాప్ 5 ల్యాప్‌టాప్స్ మీ బడ్జెట్ తగినట్టుగా ఉంటాయి. అమెజాన్ సేల్ సందర్భంగా పవర్‌ఫుల్ స్పెషిఫికేషన్లు, ఆకర్షణీమైన డిజైన్‌లు, పర్ఫార్మెన్స్‌తో కూడిన ఈ ల్యాప్‌టాప్స్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
HP 15 :
కొత్త HP 15 ల్యాప్‌టాప్ ధర రూ. 36,990 నుంచి అందుబాటులో ఉంది. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3-1315U ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 512GB SSD, 15.6-అంగుళాల ఫుల్ HD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే కలిగి ఉంది. విండోస్ 11 హోమ్‌లో రన్ అవుతుంది. స్లిమ్, మైక్రో-ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంది.
ఏసర్ ఆస్పైర్ 3 :
ఏసర్ స్మార్ట్‌చాయిస్ ఆస్పైర్ 3 ల్యాప్‌టాప్ ఇంటెల్ సెలెరాన్ N4500 ప్రాసెసర్, 8GB ర్యామ్, 256GB SSDతో వస్తుంది. ఈ ఏసర్ మోడల్ రూ.21,990కి లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్. 15.6-అంగుళాల HD డిస్‌ప్లే, HD వెబ్‌క్యామ్, 38 WHR బ్యాటరీని కలిగి ఉంది. విండోస్ 11 హోమ్‌లో రన్ అవుతుంది. బ్రౌజింగ్, స్ట్రీమింగ్ వంటి ఇతర టాస్కులకు రోజువారీ పనులకు అద్భుతంగా ఉంటుంది.
డెల్ ఇన్స్పిరాన్ 3530 :
డెల్ (Inspiron) 3530 ల్యాప్‌టాప్ ధర రూ. 34,990కు లభిస్తోంది. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3-1305U ప్రాసెసర్, 8GB ర్యామ్, 512GB SSD స్టోరేజీ కలిగి ఉంది. సన్నని, తేలికైన ల్యాప్‌టాప్. 15.6-అంగుళాల ఫుల్ HD IPS డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. విండోస్ 11లో రన్ అవుతుంది.
అసూస్ వివోబుక్ గో 15 :
అసూస్ (ASUS) వివోబుక్ గో15లో ఎఎండీ రైజెన్ 5 7520U ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSD ఉన్నాయి. 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే కలిగి ఉంది. విండోస్ 11పై రన్ అవుతుంది. MS Office 2021 కూడా ఉంది. అలెక్సా ఇంటర్నల్ బిల్ట్ అయి ఉంది. 1.63 కిలోల సన్నని, తేలికపాటి డిజైన్‌లో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ సేల్‌లో రూ. 39,990 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.
లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 :
రూ.38,990 ధరకే లభించే లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3లో రైజెన్ 5 5625U ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSD ఉన్నాయి. 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే, ఇంటిగ్రేటెడ్ AMD రేడియన్ గ్రాఫిక్స్ కలిగి ఉంది. MS ఆఫీస్ హోమ్‌తో విండోస్ 11లో రన్ అవుతుంది. సన్నని, తేలికైన ల్యాప్‌టాప్, మల్టీ టాస్కింగ్, రోజువారీ వినియోగానికి బెస్ట్ ల్యాప్‌టాప్..