Vivo X100 Price : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ఆఫర్లు.. భారీగా తగ్గిన వివో X100 ఫోన్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

Vivo X100 Price : వివో X100 ధర తగ్గింది.. ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ సందర్భంగా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ లిమిటెడ్ ఆఫర్ ఎలా పొందాలంటే?

Vivo X100 Price : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ఆఫర్లు.. భారీగా తగ్గిన వివో X100 ఫోన్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

Vivo X100 Price

Updated On : July 12, 2025 / 12:34 PM IST

Vivo X100 Price : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ సందర్భంగా వివో ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ వివో X100 ఫోన్ రూ.11వేలకు పైగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ లిమిటెడ్ టైమ్ (Vivo X100 Price) ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే.. వివో ప్రీమియం ఫోన్ అసలు ధర రూ. 63,999 ఉండగా సేల్ ద్వారా రూ.50వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.

పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్, కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆకట్టుకునే కెమెరాలతో వివో X-సిరీస్ సరసమైన ధరకే పొందవచ్చు. ఒకవేళ మీ పాత ఫోన్‌ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. వివో X100 డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌కార్ట్‌లో వివో X100 ధర :
ప్రస్తుతం వివో X100 5G ఫోన్ ధర రూ.52,989కి అందుబాటులో ఉంది.. లాంచ్ ధర రూ.63,999 నుంచి రూ.11,010 తగ్గింది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.4వేల వరకు (5శాతం) క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Google Pixel 8a Price : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌.. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ.22వేలు తగ్గింపు.. ఇలా కొన్నారంటే..!

ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై నెలకు రూ.1,863 నుంచి EMI బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌గేజ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌పై ఈ డీల్ అందుబాటులో ఉంది.

వివో X100 స్పెసిఫికేషన్లు :
వివో X100 5G ఫోన్ అద్భుతమైన 6.78-అంగుళాల కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 3000 నిట్‌ల టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. హుడ్ కింద, V3 ఇమేజింగ్ చిప్‌తో డైమెన్సిటీ 9300 చిప్‌సెట్, 12GB ర్యామ్ వేరియంట్‌ కలిగి ఉంది.

ఆప్టిక్స్ పరంగా వివో X100 ఫోన్ ZEISS-ట్యూన్ 50MP సోనీ IMX920 ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్, 100x డిజిటల్ జూమ్‌తో 64MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్‌టచ్ OS14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. అదనంగా, వివో X100 ఫోన్ 120W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.