Google Pixel 8a Price : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌.. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ.22వేలు తగ్గింపు.. ఇలా కొన్నారంటే..!

Google Pixel 8a Price : గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో కలిపి రూ. 22వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

Google Pixel 8a Price : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌.. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ.22వేలు తగ్గింపు.. ఇలా కొన్నారంటే..!

Google Pixel 8a Price

Updated On : July 12, 2025 / 11:51 AM IST

Google Pixel 8a Price : పిక్సెల్ లవర్స్ కోసం అద్భుతమైన డీల్.. ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ మొదలైంది.. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్‌లను (Google Pixel 8a Price) అందిస్తోంది. ఆకట్టుకునే ఫీచర్లు, క్లీన్ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఫ్లిప్‌కార్ట్ సేల్‌ మీకోసమే.. గూగుల్ పిక్సెల్ 8a ధర రూ.22వేల భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ బ్యాంకు ఆఫర్లు లేకుండానే అతి తక్కువ ధరకే అందిస్తోంది. అంటే.. పిక్సెల్ 8a ధర మరో రూ.15వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పిక్సెల్ 8a తక్కువ ధరకే కొనుగోలు చేయాలంటే ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. పిక్సెల్ ఫోన్ కొనుగోలుపై ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 8a డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ రూ.37,999కు అమ్మకానికి ఉంది. లాంచ్ ధర రూ.52,999 ఉండగా ప్రస్తుతం సేల్ సమయంలో రూ.15వేలు తగ్గింపు లభిస్తుంది. కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేమెంట్లపై అదనంగా రూ.7వేలు తగ్గింపు పొందవచ్చు.

Read Also : Amazon Prime Day 2025 Sale : అమెజాన్‌ సేల్ మొదలైందోచ్.. శాంసంగ్, వన్‌ప్లస్, ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

మొత్తంగా రూ. 22వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకుంటే.. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ.32వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8a స్పెసిఫికేషన్లు :
పిక్సెల్ 8a ఫోన్ 6.1-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కవర్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉంది. 4,492mAh బ్యాటరీతో 72 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు LPDDR5x ర్యామ్, 128GB/256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64MP క్వాడ్ PD ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.