Amazon Prime Day 2025 Sale : అమెజాన్ సేల్ మొదలైందోచ్.. శాంసంగ్, వన్‌ప్లస్, ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!
Amazon Prime Day 2025 Sale : అమెజాన్ సేల్ సమయంలో శాంసంగ్, ఐఫోన్, వన్‌ప్లస్ ఫోన్లపై మైండ్ అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి..

Amazon Prime Day 2025 Sale
Amazon Prime Day 2025 Sale : ఎప్పుటినుంచో ఎదురుచూస్తు్న్న అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సేల్ జూలై 12 నుంచి జూలై 14 వరకు మొత్తం 3 రోజుల (Amazon Prime Day 2025 Sale) పాటు కొనసాగుతుంది. ఈ సేల్ స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్, ఫ్యాషన్ వంటి కేటగిరీలపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం.. OnePlus, Samsung, Apple వంటి ప్రముఖ బ్రాండ్‌లలో ఎంపిక చేసిన మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో కొన్ని టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఇందులో 200MP మెయిన్ సెన్సార్, 50MP 5x టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంది. శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ అమెజాన్‌లో రూ.74,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.
ఆపిల్ ఐఫోన్ 16e :
ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16e మోడల్ 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16e రూ.49,249 ధరకు లభిస్తుంది.
వన్‌ప్లస్ 13 :
వన్‌ప్లస్ 13 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ 13లో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది. అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 రూ. 59,999 ధరకు లభిస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 15 :
ఆపిల్ ఐఫోన్ 15 6.1-అంగుళాల XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 3349mAh బ్యాటరీని కలిగి ఉంది. ఐఫోన్ 15 అమెజాన్‌లో రూ. 57,249 ధరకు సొంతం చేసుకోవచ్చు.