Flipkart June Epic Sale : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ సగం ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌‌లో ఇలా కొన్నారంటే?

Flipkart June Epic Sale : ఫ్లిప్‌కార్ట్‌ జూన్ ఎపిక్ సేల్‌లో శాంసంగ్ అత్యంత సన్నని ఫోన్ 200MP కెమెరా, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. పూర్తి వివరాలివే..

Samsung Galaxy S25 Edge

  • భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్‌ జూన్ ఎపిక్ సేల్‌ ప్రారంభం
  • అతి చౌకైన ధరకే 200MP కెమెరా, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్
  • 256GB మోడల్ కేవలం రూ. 59,999కే లభిస్తోంది

Flipkart June Epic Sale : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ ప్రస్తుతం భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘జూన్ ఎపిక్ సేల్’ సందర్భంగా భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ సేల్‌లో (Flipkart June Epic Sale) ఈ శాంసంగ్ ఫోన్ సగం ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌లో 200MP మెయిన్ బ్యాక్ కెమెరా ఉంది. ఇంతకీ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ఎంత తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 2 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. భారత మార్కెట్లో లాంచ్ సమయంలో 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 109,999 కాగా, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 121,999గా ఉంది. రెండింటిలోనూ స్టాండర్డ్‌గా 12GB ర్యామ్ ఆప్షన్ ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ టైటానియం జెట్‌బ్లాక్ టైటానియం సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

సగం ధరకే శాంసంగ్ 5జీ ఫోన్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 256GB మోడల్ కేవలం రూ. 59,999కే లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర కన్నా నేరుగా రూ. 50వేలు తక్కువకే లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. అదనంగా రూ. 3వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Moto G Max 5G : 200MP కెమెరా, DSLR రేంజ్ క్వాలిటీతో మోటో G Max 5జీ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

200MP కెమెరా సెటప్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌లో 200MP ప్రైమరీ కెమెరా (2x ఆప్టికల్ ఇన్-సెన్సార్ జూమ్‌), అలాగే 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ :
ఈ ఫోన్‌లో 3900mAh బ్యాటరీ ఉంది. 25W వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు Qi (వైర్‌లెస్) ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ అందిస్తుంది. 163 గ్రాముల బరువు, కొలతలు 158.2×75.6×5.8mm ఉంటుంది. అంటే.. కేవలం 5.8mm మందం మాత్రమే ఉంటుంది.

భారీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ :
ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటెక్షన్, 6.7-అంగుళాల క్వాడ్-HD+ (3120×1440 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-O డైనమిక్ అమోల్డ్ 2X స్క్రీన్ ఉంది.

ర్యామ్, ప్రాసెసర్ ఆప్షన్ :
శాంసంగ్ గెలాక్సీ S20లో ఉండే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ ఉంది. 12GB వరకు ర్యామ్ ఆప్షన్ అందిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన గెలాక్సీ S25 సిరీస్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతోంది.