Flipkart Big Discounts : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ బ్యాంకు కార్డులపై 10శాతం తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Flipkart Big Discounts : ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13పై ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 58,499 ప్రారంభ ధరతో లిస్టు అయింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది.

Flipkart offering big discounts on iPhone 13 and iPhone 14 series months ahead of iPhone 15 launch

Flipkart Big Discounts : ఆపిల్ ఐఫోన్ 15 అతి త్వరలో లాంచ్‌ కానుంది. కొన్ని నెలల ముందు ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది. ఇప్పటికే, బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కొన్ని పాత ఐఫోన్‌లపై రూ.11,401 వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నిర్దిష్ట ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మిగిలిన ఆఫర్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 13 సిరీస్‌పై ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 58,499 ప్రారంభ ధరతో అందిస్తుంది.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఐఫోన్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.57,499కి తగ్గుతుంది. ఆపిల్ ఇప్పటికీ (iPhone 13) అధికారిక ధర రూ. 56,999గా ఉంది. ఐఫోన్ 14 సిరీస్ అసలు ధర రూ. 79,900 నుంచి రూ. 68,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 14 ప్లస్ (128GB స్టోరేజ్ వేరియంట్) ధర రూ.73,999కి విక్రయిస్తోంది.

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. పోకో M5 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు అంటే ఇలా ఉండాలి.. వెంటనే కొనేసుకోండి..!

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,27,999కి లిస్టు అయింది. అయితే, ఐఫోన్ ప్రో మోడల్ ధర రూ. 1,16,999. కానీ, లేటెస్ట్ వెర్షన్ కన్నా iPhone 13ని కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే రెండింటిలో ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. కెమెరా అవుట్‌పుట్ పరంగా పెద్దగా తేడా లేదు. ఐఫోన్ కెమెరాలు (Samsung Galaxy S23) సిరీస్ కన్నా మెరుగైనవి కావని చెప్పవచ్చు. కానీ, ఐఫోన్‌లు డే టైమ్ అద్భుతమైన షాట్‌లను క్యాప్చర్ చేయగల సెన్సార్‌లు ఉన్నాయి. చిప్‌సెట్ కూడా అదే విధంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఆపిల్ ఆరేళ్ల పాత ఫోన్‌లకు కూడా అప్‌డేట్‌లను అందిస్తోంది. మీరు ఈ సెక్షన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Flipkart offering big discounts on iPhone 13 and iPhone 14 series months ahead of iPhone 15 launch

డిస్‌ప్లే రెండు యూనిట్‌లలో క్లియర్‌గా ఉంటుంది. ఐఫోన్ 14 బ్యాటరీ సైజు కొంచెం పెద్దది. కానీ, రియల్ వరల్డ్ వినియోగంలో పెద్దగా తేడా లేదు. ఇప్పటికీ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందవచ్చు. ఈ రోజుల్లో Android ఫోన్‌లు అందిస్తున్న వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు. కానీ, ఆపిల్ ఐఫోన్‌లతో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదని గుర్తుంచుకోండి. ఈ ఛార్జర్ కోసం అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. చివరగా iPhone 11 ధర 43,999కు లిస్టు అందిస్తోంది. ఈ ఐఫోన్ 11 5G సపోర్టు చేయదు. అయినా ఈ ఐఫోన్‌పై చాలా ఆఫర్లు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ డీల్‌లన్నీ ఫ్లిప్‌కార్ట్ సేల్ వ్యవధిలో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై క్రేజీ డిస్కౌంట్.. రూ. 16వేలు తగ్గిందోచ్.. డోంట్ మిస్..!

ట్రెండింగ్ వార్తలు