Flipkart Plus Premium : ఫ్లిప్‌కార్ట్‌‌లో ‘ప్లస్ ప్రీమియం’ మెంబర్‌షిప్.. ఈ కొత్త సర్వీసు పూర్తిగా ఉచితం.. త్వరలో భారత్‌లో లాంచ్..!

Flipkart Plus Premium : ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం సర్వీసును ప్రవేశపెడుతోంది. ప్రస్తుత కస్టమర్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌’కు అడ్వాన్స్ మెంబర్‌షిప్ ప్రొగ్రామ్ అందించనుంది. భారత మార్కెట్లో ఈ కొత్త మెంబర్‌షిప్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించనుంది.

Flipkart Plus Premium membership to launch soon, here are the details

Flipkart Plus Premium : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తమ వినియోగదారుల కోసం కొత్త సర్వీసును ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం’ మెంబర్‌షిప్ ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) ప్రోగ్రామ్‌తో పోలిస్తే.. మెరుగైన ప్రయోజనాలను అందించవచ్చు. వినియోగదారులు సాధారణ షాపింగ్ ద్వారా సూపర్‌కాయిన్స్‌ను పొందవచ్చు. ఇందులో ‘ప్రీమియం’ అనే పదం ఉన్నప్పటికీ.. ఈ కొత్త ప్రోగ్రామ్ పేమెంట్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసు కాదని గమనించాలి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌పై కనిపించే టీజర్ ప్రకారం.. వినియోగదారులకు ఈ సర్వీసును పూర్తిగా ఉచితంగా అందించనుంది.

ప్రస్తుత కస్టమర్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌కి అడ్వాన్స్ సర్వీసు (Flipkart Plus Premium)గా ఉపయోగపడనుంది. ఈ సర్వీసును త్వరలో భారత్‌లో లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ప్లస్ ప్రీమియం నిర్దిష్ట పెర్క్‌లు ఇంకా బహిర్గతం చేయలేదు. రాబోయే రెండు వారాల్లో అన్ని వివరాలను వెల్లడిస్తామని యూజర్లకు హామీ ఇచ్చింది.

Read Also : Flipkart Big Saving Day Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్.. కేవలం రూ. 590కే ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.!

ప్రస్తుతం ఉన్న ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ విషయానికొస్తే.. వినియోగదారులకు పూర్తిగా ఉచితం కాదు. కొత్త ప్రోగ్రామ్ ద్వారా వివిధ ఇతర బెనిఫిట్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ పర్యావరణ వ్యవస్థలోని వర్చువల్ కరెన్సీ అయిన SuperCoinsతో కస్టమర్‌లకు రివార్డ్ అందిస్తుంది. విభిన్న రకాల ప్రొడక్టుల్లో కొనుగోళ్లు చేస్తున్నప్పుడు ఈ రివార్డ్‌లను (Flipkart) యాప్ లేదా వెబ్‌సైట్‌లో (Redeem) చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌లో (Flipkart Plus)లో పాల్గొనాలంటే.. వినియోగదారులు వెబ్‌సైట్‌లో చేసిన ప్రతి కొనుగోలుపై సంపాదిస్తున్న (SuperCoins)ని ఉపయోగించి లాయల్టీ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.

Flipkart Plus Premium membership to launch soon, here are the details

ఇప్పటికే ఉన్న ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్, వేగవంతమైన సూపర్ కాయిన్స్, ఆదాయాలు, డీల్‌లకు ముందస్తు యాక్సెస్, ప్రాధాన్యత కలిగిన కస్టమర్ సపోర్టు వంటి అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌గా మారడానికి యూజర్లు 200 సూపర్‌కాయిన్‌లను ఉపయోగించుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్లాట్‌ఫారమ్‌లో ఖర్చు చేసే ప్రతి రూ. 100కి 4 సూపర్‌కాయిన్స్‌లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం సర్వీసు ద్వారా కంపెనీ ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా మెరుగైన బెనిఫిట్స్ అందించనుంది. మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

ఈ ప్లాట్‌ఫారమ్ త్వరలో రాబోయే వారాలు లేదా రోజులలో స్వాతంత్ర్య దినోత్సవ విక్రయాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమయంలో లేదా అంతకంటే ముందు కొత్త ప్లస్ ప్రీమియం మెంబర్‌షిప్ లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి, స్వాతంత్ర్య దినోత్సవ విక్రయం (Independence Day Sale) గురించి అధికారిక ప్రకటన లేదు. కానీ, భారతీయులకు పెద్ద డిస్కౌంట్లను అందించడానికి కంపెనీ ప్రతి ఏడాది ఈ సేల్ నిర్వహిస్తుంది. అందువల్ల, ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది కూడా ఒక దానిని హోస్ట్ చేస్తుందని భావిస్తున్నారు. దీపావళికి ముందు ఫ్లిప్‌కార్ట్‌లో మరో పెద్ద సేల్ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉంది.

Read Also : Flipkart Big Discounts : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ బ్యాంకు కార్డులపై 10శాతం తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

ట్రెండింగ్ వార్తలు